సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మాతలుగా మయూరి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో మాయ పేరుతో తమిళ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని సి.కళ్యాన్ మయూరి అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..
సి.కళ్యాన్ మాట్లాడుతూ.. సెన్సేషనల్ హిట్ అయిన మయూరి సినిమా టైటిల్ తో వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తున్నాం. మొదట ఈ చిత్రాన్ని తెలుగులో హీరో నాని ప్రొడ్యూస్ చేయాల్సివుంది. కాని ఆ అవకాశం మాకు లభించింది. సినిమా కథ చెప్పగానే నయనతార వెంటనే ఓకే చేసేసారు. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లో నటిస్తున్న ఆమె ఈ సినిమాలో ఓ బిడ్డ తల్లిగా కనిపించనుంది. నయన్ ఈ చిత్రంలో మాయ, మయూరి అనే రెండు పాత్రల్లో నటించారు. ప్రతి సన్నివేశం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ అశ్విన్ కు ఇది మొదటి సినిమా అయినా బాగా డైరెక్ట్ చేసాడు. ఓ సినీ యాక్టర్ గా, ఓ బిడ్డ తల్లిగా నయనతార అధ్బుతంగా నటించింది. రింగ్ మీద ఆధారపడి సినిమా అంతా నడుస్తుంటుంది. రీరికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అధ్బుతంగా కుదిరాయి. ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు ఓ హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే, టేకింగ్ ఆ విధంగా ఉంటాయి. ఫోటోగ్రఫీ గొప్పగా ఉంటుంది. ఓ థ్రిల్లింగ్ మైండ్ గేమ్ ఇది. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది. సెన్సార్ యూనిట్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ సాగుతుంది. అందుకే నేను కూడా వరుసగా హారర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాను. నిజానికి తెలుగులో హారర్ సినిమా చేయాలని స్ట్రాంగ్ గా అనుకునే రచయితలు కాని దర్శకులు కాని లేరు. అందుకే తమిళ చిత్రాలను అనువదిస్తున్నాను.. అని చెప్పారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఆర్ట్: రామలింగం, మ్యూజిక్: రాన్ ఈథన్ యోహన్, ఎడిటర్: టి.ఎస్.సురేష్, కాస్ట్యూమ్స్: వాసుకి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోనేరు కల్పన, డైరెక్టర్: అశ్విన్ శరవణన్, ప్రొడ్యూసర్: సి.కళ్యాన్.