Advertisementt

సుబ్రమణ్యం సేల్ కు థియేటర్లు పెరుగుతున్నాయ్!

Sat 26th Sep 2015 01:57 AM
subramanyam for sale success meet,dil raju,hareesh shankar,sai dharam tej  సుబ్రమణ్యం సేల్ కు థియేటర్లు పెరుగుతున్నాయ్!
సుబ్రమణ్యం సేల్ కు థియేటర్లు పెరుగుతున్నాయ్!
Advertisement
Ads by CJ

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందించిన చిత్రం సుబ్రమణ్యం ఫర్‌సేల్‌. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో.. 

దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక సంవత్సరంపాటు పడిన కష్టానికి మంచి రిజల్ట్ వచ్చింది. హరీష్ సినిమా ఎంటర్ టైన్మెంట్ గా ఉంటేనే ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చెప్పేవాడు. తనకు స్క్రిప్ట్ పై నమ్మకం ఉంది. సెకండ్ హాఫ్ చాలా కాన్ఫిడెంట్ గా నేరేట్ చేసాడు. ఫిష్ వెంకట్, రావు రమేష్ ట్రాక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తేజు డైనమిక్ యాక్షన్, మ్యానరిజం అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలో గువ్వా గోరింకా సాంగ్ విజువల్ బ్యూటీగా నిలిచింది. గతంలో హరీష్ నేను కలిసి చేసిన చిత్రం మేము అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అప్పటినుండి ఈ బ్యానర్ లో ఓ హిట్ సినిమా చేయాలనే సంకల్పంతో హారీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీతో తేజు ని స్టార్ హీరో చేసిన హరీష్ కు, సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్.. అని చెప్పారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రిలీజ్ అయిన మొదటిరోజు పెద్ద స్థాయి హీరోకు వచ్చిన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలా రీచ్ అవుతుందో అనే టెన్షన్ ఉండేది కాని రిజల్ట్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. రాజు గారితో సినిమా చేయాలని ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు ఆయనతో సినిమా చేయాలనుకునేవాడ్ని. గబ్బర్ సింగ్ మూవీ తరువాత ఆయనతో చేసిన రామయ్య వస్తావయ్య మమ్మల్ని నిరాశ పరిచింది. తరువాత మంచి హిట్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. సుబ్రమణ్యం ఫర్ సేల్ అందరిని ఆకట్టుకుంటోంది. మొదట రాజు గారు క్లైమాక్స్ మరింత ఎమోషనల్ గా ఉంటే బావుంటుందని చెప్పగా రెండు డైలాగ్స్ యాడ్ చేసి రీషూట్ చేసాం. ఇప్పుడు క్లైమాక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రేయ్ సినిమా టీజర్ చూసి నాకు సుబ్రమణ్యం దొరికాడనుకున్నాను. వై.వి.ఎస్ చౌదరి, రవికుమార్ చౌదరి తేజు ని బాగా రెడీ చేసి నా చేతిలో పెట్టారు. వారిద్దరికీ స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో కామెడీకు స్పెషల్ ట్రాక్ రాయలేదు. ప్రతిది కథలో భాగంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల సంఖ్య కూడా పెంచనున్నాం.. అని చెప్పారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. హరీష్ గారు కళ్యాన్ మావయ్యను ఉద్దేశించి ట్విట్టర్ లో ఫ్యాన్ గా ఉండే స్థాయి నుండి నాకు ఫ్యాన్స్ వచ్చే స్థాయికి చేసారు అని ట్వీట్ చేసారు. ఈరోజు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్న  స్థాయికి తీసుకొచ్చిన హరీష్ గారికి, రాజు గారికి థాంక్స్. రేయ్ సినిమా తరువాత ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటే రాజు గారు, హరీష్ అన్న నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ నెల 24న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలనుంది. బన్నీ, రామ్ చరణ్ సినిమా బావుంది కంగ్రాట్ అని చెప్పారు.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ