Advertisementt

పులికి రెస్పాన్స్ బాగుందంటున్ననిర్మాత శోభ

Sat 03rd Oct 2015 02:53 AM
vijay latest movie puli,puli telugu version released,sruthi haasan in puli,hansika in puli,puli movie director chimbu devan  పులికి రెస్పాన్స్ బాగుందంటున్ననిర్మాత శోభ
పులికి రెస్పాన్స్ బాగుందంటున్ననిర్మాత శోభ
Advertisement
Ads by CJ

ఇళయదళపతి విజయ్‌ హీరోగా ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై చింబుదేవన్‌ దర్శకత్వంలో చింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై సిబు థమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన భారీ చిత్రం పులి. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప్రై.లి.బ్యానర్‌పై సి.శోభ తెలుగులో విడుదల చేశారు. అక్టోబర్‌ 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్‌ 2న విడుదలైంది. అక్టోబర్‌ 2 సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు వెర్షన్‌ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రదర్శింపబడుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాత సి.శోభ మాట్లాడుతూ  ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు వెర్షన్‌ ప్రదర్శింపబడుతోంది. అన్ని ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్‌తో మా సినిమా స్టార్ట్‌ అయింది. అన్ని ఏరియాల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. విజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌, శృతిహాసన్‌, హన్సికల గ్లామర్‌, శ్రీదేవి, సుదీప్‌ల క్యారెక్టర్స్‌ సినిమాకి హైలైట్‌ అయ్యాయి. ఫస్ట్‌ షోకి వచ్చిన టాక్‌తో రేపటి నుంచి థియేటర్స్‌కి హెవీ క్రౌడ్‌ వుంటుందని బయ్యర్స్‌, ఎగ్జిబిటర్స్‌ చెప్తున్నారు. మా ఎస్‌.వి.ఆర్‌. మీడియా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రంగా పులి అందర్నీ ఎంటర్‌టైన్‌ చెయ్యడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు. 

విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: నటరాజన్‌ సుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ప్రసాద్‌, నిర్మాతలు: సి.శోభ, సిబు థమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌, రచన-దర్శకత్వం: చింబుదేవన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ