కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సోగ్గాడే చిన్నినాయనా. ఈ చిత్రానికి సంబంధించిన మైసూర్ షెడ్యూల్ పూర్తయింది. దీంతో టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ సొగ్గాడే చిన్నినాయనా వంటి ఫుల్ కామెడీ మూవీ చేస్తున్నాను. సొగ్గాడిగా, అమాయకుడిగా రెండు వేరియేషన్లు వున్న క్యారెక్టర్స్ ఈ చిత్రంలో చేస్తున్నాను. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫాదర్ క్యారెక్టర్ ఇందులో ఘోస్ట్‌గా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్ అది. ఈ పాయింట్ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు క్యారెక్టర్స్‌ను బేస్ చేసుకుని సొగ్గాడే చిన్ని నాయనా అనే టైటిల్ పెట్టాం. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మంచి రచయిత కూడా. అతను చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒరిజినల్ స్టోరీ లైన్‌ను ఉయ్యాలా జంపాలా ఫేమ్ రామ్మోహన్ ఇచ్చారు. కళ్యాణ్ ఆ పాయింట్‌ను బాగా డెవలప్ చేశాడు. ఇటీవల మైసూర్‌లో భారీ షెడ్యూల్ చేశాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టోటల్‌గా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మంచి రిలీజ్ డేట్ చూసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్, డా. బ్రహ్మానందం, సంపత్, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్ అనసూయ, దీక్షా పంత్, బెనర్జీ, సురేఖావాణి, దువ్వాసి మోహన్, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, సిద్ధార్థ్ రామస్వామి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.