Advertisementt

ఎటాక్ మూవీ ట్రైలర్ లాంచ్!

Wed 07th Oct 2015 08:43 AM
attack movie trailer launch,manchu manoj,ram gopal varma  ఎటాక్ మూవీ ట్రైలర్ లాంచ్!
ఎటాక్ మూవీ ట్రైలర్ లాంచ్!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్, సురభి జంటగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్, శ్రీ శుభశ్వేత ఫిల్మ్స్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్పిస్తున్న చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ బుధవారం  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా.. 

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. చాలా మంది నాకు సగం పిచ్చి ఉందా.. లేదా ఫుల్ గా పిచ్చి ఉందా.. శివ లాంటి సినిమా తీసినవాడు ఆ రేంజ్ లో సినిమాలు ఎందుకు తీయడంలేదని నా మీద రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. గత సంవత్సరంలో ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేయాలనుకున్నాను. ఆ సమయంలో కొన్ని సినిమాలు చేసాను. అప్పుడు సి.కళ్యాన్ గారు నా దగ్గరకి వచ్చి ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నావని నాకు జ్ఞానోదయం చేసారు. ప్రేక్షకులకు కావలసినట్లుగా సినిమాలు చేయాలని నాతో ఈ సినిమా చేయించారు. నేను క్యారెక్టర్స్ ను బాగా నమ్ముతాను. మనోజ్ మసాలా హీరో అయినా చాలా రియలిస్టిక్ గా పెర్ఫార్మ్ చేసాడు.. అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సి.కళ్యాన్ గారు రామ్ గోపాల్ వర్మ గారితో శివ లాంటి సినిమా చేస్తానని పట్టుబట్టి ఈ సినిమా చేసారు. ఈ సంవత్సరం మయూరి సినిమాతో పెద్ద హిట్ కొట్టాం. ఎటాక్ మరో సెన్సేషనల్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నాను.. అని చెప్పారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ గారిని ప్రతి రోజు కలిసి గొడవపడేవాడ్ని. మీ కష్టాన్ని వృధా చేసుకుంటున్నారు.. మిమ్మల్ని చూసి నేర్చుకున్నవారంతా కమర్షియల్ హిట్స్ సాదిస్తున్నారు.. మీరు సినిమా చేస్తే ఇండస్ట్రీ అంతా ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలని చెప్పి ఆయనతో ఈ సినిమా చేయించాను. స్టార్ కాస్ట్ ఉండాలని రిక్వెస్ట్ చేశాను. మనోజ్ క్యారెక్టర్ కి సూట్ అవుతాడని భావించి ఆయనను సెలెక్ట్ చేసుకున్నాం. సినిమా మొదటి కాపీ చూస్తున్నప్పుడు ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ తో మరలా ఓ వారంరోజుల పాటు షూట్ చేసాం. చాలా సైలెంట్ గా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా చేసాం. అంజి ఫోటోగ్రఫీ అధ్బుతంగా ఉంటుంది. ఈ సినిమాతో ఖచ్చితంగా బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు సొంతం చేసుకుంటాడు. డబ్బు కంటే ఈ సినిమాతో రాము గారికి మంచి పేరు రావాలి. నవంబర్ మూడవ వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ లో ఆడియో రిలీజ్ చేయనున్నాం. మా సంస్థ నుండి మంచి సినిమా ఇస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మయూరి ఎంత పెద్ద హిట్ అయిందో.. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.

అంజి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ గారితో ఇది నాకు రెండో సినిమా. లొకేషన్స్ రెగ్యులర్ గా ఉండకూడదని కొత్త లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని ఎవరు షూట్ చేయని ప్రదేశాల్లో షూట్ చేసాం. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన చేసిన రంగీలా, శివ సినిమాలు చూసి ఆయనతో ఎప్పటికైనా వర్క్ చేయాలనుకున్నాను. స్టొరీ చెప్పగానే నాకు చాలా నచ్చింది. చాలా సమయం తీసుకొని సినిమా తీర్చిదిద్దాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు. 

ఈ చిత్రానికి రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, ఎడిటర్: అన్వర్ అలీ, మ్యూజిక్: రవి శంకర్, ఫోటోగ్రఫీ: అంజి, ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర, టాగూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామసత్యనారాయణ, నిర్మాతలు:  శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ