Advertisementt

హైదరాబాద్ లో ఊపిరి పోస్తున్నారు!

Thu 08th Oct 2015 02:54 PM
oopiri movie,nagarjuna,karthi,thamanna,pvp banner  హైదరాబాద్ లో ఊపిరి పోస్తున్నారు!
హైదరాబాద్ లో ఊపిరి పోస్తున్నారు!
Advertisement
Ads by CJ

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్‌, బృందావనం ఎవడు చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ఊపిరి. ఈ చిత్రానికి సంబంధించిన యూరప్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా..

నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ.. నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో మా బేనర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఊపిరి చిత్రానికి సంబంధించిన యూరప్‌ షెడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశాం. ప్యారిస్‌, లియోన్‌, బెల్‌గ్రేడ్‌ వంటి రేర్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది. స్నేహానికి అర్థం చెప్పే స్నేహితులుగా నాగార్జునగారు, కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ నిజంగా సూపర్బ్‌. వంశీ పైడిపల్లి సినిమాని చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డెఫినెట్‌గా నాగార్జునగారి కెరీర్‌లో ఊపిరి మరో మెమరబుల్‌ మూవీ అవుతుంది. అలాగే కార్తీ ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న ఈ స్ట్రెయిట్‌ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం మా పివిపి సంస్థలో మరో ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది.. అన్నారు. 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా, సహజనటి జయసుధలతో పాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, ఫొటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ