Advertisementt

శంకర్‌ సినిమాలో అర్నాల్డ్‌ ష్వార్జెనెగర్‌.!

Sat 10th Oct 2015 10:46 AM
hollywood star arnold schwarzenegger in robo 2,shankar latest movie robo2,rajnikanth and shanakr combo movie robo 2,arnold schwarzenegger as villain in robo 2  శంకర్‌ సినిమాలో అర్నాల్డ్‌ ష్వార్జెనెగర్‌.!
శంకర్‌ సినిమాలో అర్నాల్డ్‌ ష్వార్జెనెగర్‌.!
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌ సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన రోబో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తమిళ్‌ హయ్యస్ట్‌ బడ్జెట్‌తో తీసిన సినిమాగా రోబో రికార్డ్‌ సృష్టించింది. అలాగే కలెక్షన్లపరంగా ఇప్పటివరకు తమిళ్‌లో వున్న రికార్డులన్నింటినీ రోబో క్రాస్‌ చేసేసింది. ఇదిలావుంటే శంకర్‌ రోబో చిత్రానికి సీక్వెల్‌గా రోబో2 చెయ్యబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తారని చాలా పేర్లు వినిపించాయి. అయితే అవేవీ కన్‌ఫర్మ్‌ అవ్వలేదు. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ పేరు కూడా ఆ జాబితాలో వుంది. ఒక దశలో అమీర్‌ఖానే రోబో2లో విలన్‌ అని చెప్పుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అమీర్‌ఖాన్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఫైనల్‌గా హాలీవుడ్‌ స్టార్‌ అర్నాల్డ్‌ ష్వార్జెనెగర్‌ రోబో2 చిత్రంలో విలన్‌గా కన్మర్మ్‌ అయ్యాడట. విక్రమ్‌ కాంబినేషన్‌లో శంకర్‌ చేసిన ఐ చిత్రం ఆడియో ఫంక్షన్‌కి అర్నాల్డ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో తనకు తమిళ్‌ సినిమాల్లో నటించాలని వుందని తన మనసులోని మాటను వెల్లడించాడు అర్నాల్డ్‌. ఆ మాటతో అర్నాల్డ్‌ని అప్రోచ్‌ అయ్యాడు శంకర్‌. కథ, తన క్యారెక్టర్‌ గురించి తెలుసుకున్న అర్నాల్డ్‌ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ చిత్రం కోసం 25 రోజులు ఇండియాలో వుండబోతున్నాడు అర్నాల్డ్‌. ప్రస్తుతం రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ చేస్తున్న చిత్రం కంప్లీట్‌ అవ్వగానే రోబో2 సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే రోబో2 చిత్రానికి నిర్మాత ఎవరు అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ