నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటికాపీను శివశక్తిదత్తా కు అందించారు.
ఈ సందర్భంగా..
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ పనిచేస్తూ ఉంటారు. ఏమైనా అవకాశాలు వస్తే వెళ్లిపోతుంటారు. బాహుబలి సినిమా సమయానికి నాతో జగదీశ్ లేడు అనేసరికి చాలా టెన్షన్ పడ్డాను. తను లేకుండా సినిమా ఎలా చేయాలనుకున్నాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతగా కలిసిపోయాడు. మగధీర సినిమాకు ప్రతిది దగ్గరుండి తనే చూసుకున్నాడు. నేను సెట్ లోకి వెళ్లేసరికి అన్ని రెడీగా ఉంచేవాడు. ప్రతి విషయంలో చాలా డీటైల్డ్ గా ఉంటాడు. ఎంత డీటైల్డ్ గా చెప్తారో ప్రేక్షకులకు అంత బాగా రీచ్ అవుతారు. నవీన్ చంద్ర, లావణ్య ల జంట అధ్బుతంగా ఉంటుంది. ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ తో చక్కగా నటిస్తారు. పెద్దన్నయ్య నా ప్రతి సినిమాకు మ్యూజిక్ అందించి ఎంతో సపోర్ట్ చేస్తారు. అలానే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చి అంతే సపోర్ట్ చేసారు. ప్రస్తుతం మ్యూజిక్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఓ నాలుగు వారాలు వింటే చాలు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా స్టాండర్డ్స్ ఉన్న మ్యూజిక్ చేస్తున్న అన్నయ్యకు ధన్యవాదాలు.. అని చెప్పారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. అమ్మ నాన్న పెట్టిన పేరును మార్చి రైటర్ గా మంచి పీరు తెచ్చుకున జగదీశ్ కు ఓ లెక్క ఉంది. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడనేదానికి ఓ లెక్క ఉంది. అలానే లచ్చిందేవికి ఓ లెక్కుంది. ఆ లెక్కను విప్పి చూపించడానికి ప్రయత్నిస్తున్న జగదీశ్ కు మంచి సక్సెస్ రావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
శివశక్తిదత్తా మాట్లాడుతూ.. లచ్చిందేవికి ఓ లెక్కుంది వెనుక ఓ లక్ ఉంది. ఆ లక్ అందరికి కలిసి రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ.. రాజమౌళి, కీరవాణి కుటుంబాలతో ఉన్న సాన్నిహిత్యం వలన నిజాయితీగా ఉండడం నేర్చుకున్నాను. రాజమౌళి గారు నేను ఎక్కువగా మాట్లాడుకోము. ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే సైగ చేస్తారు. నాకు వెంటనే అర్ధం అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని కీరవాణి గారిని అడగగానే స్క్రిప్ట్ అంతా చదివి డైలాగ్స్, స్క్రీన్ ప్లే బావుందని చెప్పి మ్యూజిక్ చేయడానికి ఓకే చెప్పారు. మన ఇంట్లో ఉండే లెక్క మనకు తెలుసు. కాని కొన్ని లక్షల కోట్లు మనకు తెలియకుండా అనాథగా పడున్నాయి. వాటికి ఓ లెక్కుంటుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.. అని చెప్పారు.
నిర్మాత సాయి ప్రసాద్ కామినేని మాట్లాడుతూ.. జగదీశ్ బాగా డైరెక్ట్ చేసాడు. నవీన్, లావణ్య చక్కగా నటించారు. మ్యూజిక్, సినిమా మంచి హిట్ కావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సాయి కొర్రపాటి గారికి, హను రాఘవపుడి గారికి కృతజ్ఞతలు. జగదీశ్ గారు పర్ఫెక్షన్ ఉన్న దర్శకుడు. కీరవాణి గారి మ్యూజిక్ అందిస్తున్న సినిమాలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అని చెప్పారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఓ లెక్కుంటుంది. అలానే లచ్చిందేవికి ఓ లెక్కుంటుంది. ఈ సినిమాలో నా పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. నవీన్ తో చాలా కంఫర్ట్ గా వర్క్ చేసాను. కీరవాణి గారు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది.. అని చెప్పారు.
సునీల్ మాట్లాడుతూ.. లచ్చిందేవికి ఓ లెక్కుంది పాటలు లెక్కకు మించి జనాల్లోకి వెళ్లాలని, హీరో హీరోయిన్స్ సక్సెస్ కావాలని, దర్శకనిర్మాతలకు లెక్కకు మించి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
నాని మాట్లాడుతూ.. జగదీశ్ గారు ఈగ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసారు. జగదీశ్ లుక్ చూస్తుంటే జూనియర్ రాజమౌళి లా అనిపిస్తున్నారు. నవీన్ చంద్ర జెన్యూన్ టాలెంట్ ఉన్న యాక్టర్. తనకు సక్సెస్ రావాలని కోరుకునే వల్లాలో నేను కూడా ఒకడిని. రీసెంట్ గా లావణ్య నా ఫైల్ లో నటించింది. అది పెద్ద సక్సెస్ అయింది. అలానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. టైటిల్ నాకు చాలా నచ్చింది. పోస్టర్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. జగదీశ్ గారు రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి.. అని చెప్పారు.
నరేష్ మాట్లాడుతూ.. నవీన్ చంద్ర మంచి టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తున్నాడు. వారందరికీ లక్ష్మీదేవి వరించాలని కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంపూర్నేష్ బాబు, రాహుల్ రవీంద్రన్, సెంథిల్ కుమార్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాటలు: శివశక్తి దత్తా, అనంత శ్రీరాం, ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరావు, డి.ఓ.పి: ఈశ్వర్, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన-దర్శకత్వం: జగదీశ్ తలశిల.