Advertisementt

ప్రేమిస్తే కి పదేళ్ళు..!

Mon 12th Oct 2015 07:23 AM
premisthe 10 years celebrations,suresh kondeti,maruthi  ప్రేమిస్తే కి పదేళ్ళు..!
ప్రేమిస్తే కి పదేళ్ళు..!
Advertisement
Ads by CJ

పదేళ్ళ క్రితం అక్టోబర్ 12న ప్రేమిస్తే చిత్రం విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో మరో చరిత్ర, సీతాకోకచిలుక ఎలా అయితే మైలు రాళ్ళుగా నిలిచాయో అలానే ప్రేమిస్తే చిత్రమూ అజరామర ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రొడ్యూసర్ గా ఎస్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన కాదల్ చిత్రాన్ని నిర్మాత సురేష్ కొండేటి ప్రేమిస్తే పేరుతో తెలుగులో విడుదల చేసారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

సురేష్ కొండేటి మాట్లాడుతూ.. పరిశ్రమలో అందరు ప్రోత్సహించడం వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను. నిర్మాతగా మారకముందు వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్ గా పని చేసాను. ఆ సమయంలో మారుతితో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆయన కాదల్ సినిమాను చూసి తెలుగులో మనం రిలీజ్ చేద్దామని నాకు సినిమా చూపించారు. చూసిన వెంటనే డబ్బింగ్ రైట్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. కాని చాలా మంది సినిమా చేయొద్దని భయపెట్టారు. చిరంజీవి గారు సంతోషం రెండో వార్షికోత్సవ సంబరాల్లో నువ్వు నిర్మాతగా మారితే చూడాలనుంది సురేష్ అని చెప్పారు. ఆయన కోరిక మేరకు నేను నిర్మాతగా మారాను. దేవి థియేటర్ లో ప్రేమిస్తే చిత్రం 170 రోజులు ఆడింది. ఆ సినిమా స్పూర్తితో మలయాళంలో మంచి హిట్ సాధించిన సినిమాను తెలుగులో జతగా పేరుతో అనువదిస్తున్నాను.. అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ప్రేమిస్తే సినిమా లేకపోతే నేను అసలు ఇండస్ట్రీలో కనిపించేవాడ్ని కాదు. డిస్ట్రిబ్యూటర్ గా నేను పని చేస్తున్న రోజుల్లో 35 లక్షలు ఇన్వెస్ట్ చేసి కొందరితో కలిసి సినిమా నిర్మించాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చినా.. కమర్షియల్ గా మేం నష్టపోయాం. ఆ సమయంలో కాదల్ అనే తమిళ చిత్రాన్ని చూసాను. ఆ చిత్రం నాకు బాగా కనెక్ట్ అయింది. ఎలా అయినా తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యాను. సురేష్ గారిని కలిసి సినిమా చూపించి ఆయనతో కలిసి ప్రేమిస్తే పేరుతో తెలుగులో రిలీజ్ చేసాం. ఆ చిత్రం మాకు ఎన్నో లాభాలు తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేల చేసింది.. అని చెప్పారు.

శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని వైజాగ్ లో డిస్ట్రిబ్యూట్ చేసాం. మంచి సక్సెస్ సాధించింది. 10 సంవత్సరాల తరువాత ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. అని చెప్పారు.

దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. చిన్న చిత్రంతో నిర్మాతగా మారి ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ గా ఎదిగారు మారుతి గారు. ఆయన ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రేమిస్తే సినిమాకు సీక్వెల్ చేస్తే మాత్రం తెలుగులో చేసి దాన్ని తమిళంలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

కళ్యాన్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రేమిస్తే చిత్రంలా ట్రెండ్ సెట్ చేసే చిత్రాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ