నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డిక్టేటర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మంచి మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశామని శ్రీవాస్ తెలిపారు. రైడ్, కందిరీగ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రే్క్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముగ్గురు కథానాయికల పాత్రలు సినిమాకి కీలంగా నిలుస్తాయని శ్రీవాస్ తెలిపారు.
మరిన్ని విశేషాలను దర్శకుడు శ్రీవాస్ తెలియజేస్తూ.. ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడతారు. ఈరోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది.. అన్నారు.
రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.