Advertisementt

మాంజ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్!

Fri 16th Oct 2015 04:37 AM
maanja movie,kishan ss,avika gor,giridhar mamidipalli  మాంజ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్!
మాంజ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్!
Advertisement
Ads by CJ

కిషన్ ఎస్ఎస్, అవికా గోర్, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మాంజ. కిషన్ ఎస్ఎస్ దర్శకుడు. గురువారం హైదరాబాద్ లోని ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా.. 

శ్రీకాంత్ మాట్లాడుతూ.. కిషన్ మూడు సంవత్సరాల వయస్సులో ఇంట్లో ఉండే హ్యాండి కెమెరా పట్టుకొనే ఉండేవాడు. మూడున్నర సంవత్సరాలకు చిల్డ్రన్ స్టోర్ కి మోడల్ గా సెలక్ట్ అయ్యి ఎన్నో యాడ్స్ లో నటించాడు. తనకు ఆరు సంవత్సరాలప్పుడు నా దగ్గరకి వచ్చి డాడీ నేను ఫోటోషాప్ నేర్చుకుంటానని చెప్పాడు. అలానే ఏడు సంవత్సరాల వయసులో సౌండ్ ఇంజనీరింగ్, ఎనిమిదవ సంవత్సరంలో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. తొమ్మిదేళ్లప్పుడు సినిమా చేయాలనుందని చెప్పాను. నేను ప్రొడ్యూస్ చేయలేనని చెప్పాను. ఆ సమయంలో చాలా మంది తనను ప్రోత్సహించడానికి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే కిషన్ 11 నేషనల్ అవార్డ్స్, గోల్డెన్ లోటస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.. అని చెప్పారు.

కిషన్ ఎస్ఎస్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం నేనొక ప్రోగ్రాం కి వెళ్లాను. అక్కడున్న వారితో కాస్త సమయం గడిపి వారిని ఇన్స్పైర్ చేయమని నాకు ఆహ్వానం వచ్చింది. వారితో చాలాసేపు మాట్లాడిన తరువాత నాకొక విషయం తెలిసింది. వారంతా బాల నేరస్తులని. గోర అపరాధాలు చేసిన వారిని నేను ఇన్స్పైర్ చేసినప్పుడు నేనొక విషయాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అక్కడ నుండే మాంజ సినిమా ప్రయాణం మొదలయ్యింది. ఇదొక ఎమోషనల్ మూవీ. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇది కమర్షియల్ మూవీ కాదు.. నిజానికి దగ్గరగా ఉండే సినిమా. అవికా చాలా న్యాచురల్ గా నటించింది. ఓ డిఫరెంట్, చాలెంజింగ్ రోల్ ప్లే చేసింది. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేరోజు రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ కు ఎంట్రీ వెళ్లిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.. అని చెప్పారు.

అవికా గోర్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఓ చాలెంజింగ్ రోల్ లో నటించే అవకాసం ఇచ్చిన కిషన్ కు థాంక్స్. కిషన్ నుండి చాలా నేర్చుకున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని చెప్పారు.

గిరిధర్ మాట్లాడుతూ.. అవికాతో లక్ష్మి రావే మా ఇంటికి సినిమా చేసే సమయంలో తనకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బెంగుళూరు వెళ్లి వాళ్ళ షూటింగ్ చూసినప్పుడు తెరకెక్కించే విధానం నాకు చాలా నచ్చింది. కిషన్ సినిమా లైన్ చెప్పగానే ఎలా అయినా తెలుగులో నేనే రిలీజ్ చేయాలనుకున్నాను. ఎవరు టచ్ చేయని ఓ పాయింట్ తీసుకొని సినిమా చేసాడు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, నవంబర్ చివరి వారంలో మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది.. అని చెప్పారు. 

చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల క్రితం నేను కిషన్ ను ఓ ప్రోగ్రాం లో కలిసాను. చాలా ఇన్స్పిరేషనల్ గా మాట్లాడాడు. తను డైరెక్ట్ చేసిన సినిమాలో నాకు పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓ ఫిలాసిఫికల్ టచ్ ఉన్న ఓ పాట రాసాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సురేష్ గంగుల, పద్మజ మామిడిపల్లి, వంశి చంద్ర వట్టికుటి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ హెచ్ఆర్, డైలాగ్స్: వంశి చంద్ర వట్టికుటి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:మగేష్ కె దేవ్, ఎస్ కె రావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కిషన్ ఎస్ఎస్, మ్యూజిక్: వివేక్ కార్, మనోజ్ శ్రీహరి, కిషన్ ఎస్ఎస్, లిరిక్స్: డా. చల్లా భాగ్యలక్ష్మి, సురేష్ గంగుల, మ్యూజిక్ ప్రొడ్యూసర్: వినయ్ పాటిల్, ఎడిటింగ్ అండ్ డిఐ: మల్టిడైమెన్షన్ టెక్నాలజీస్, ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, డైరెక్టర్: కిషన్ ఎస్ఎస్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ