Advertisementt

దసరా బరిలోకి వరుణ్ తేజ్ కంచె..!

Fri 16th Oct 2015 05:11 AM
kanche,kanche movie,kanche movie release date declared,kanche telugu movie,varun tej,krish,kanche release in dussehra  దసరా బరిలోకి వరుణ్ తేజ్ కంచె..!
దసరా బరిలోకి వరుణ్ తేజ్ కంచె..!
Advertisement
Ads by CJ

అక్టోబర్ 22న దసరా కానుకగా కంచె విడుదల 

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన చిత్రం కంచె. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తం గా విడుదల కాబోతోంది. బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

తొలుత నవంబరు 6 న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, అనూహ్యం గా అఖిల్ సినిమా వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే చిత్రం ఫస్ట్ కాపీ రెడీ గా ఉండటం, సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికేట్ చేతిలో ఉండటం తో ఈ నిర్ణయం తీసుకోటం సులభం అయ్యింది. 

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా  ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో సాగే ఒక ప్రేమ కథ ఈ కంచె. డైరెక్టర్  క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజమైన వరల్డ్ వార్ 2 గన్స్ , ట్యాంక్స తో జార్జియా లో భారి వ్యయం తో చిత్రీకరించిన వార్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది. 

కంచె చిత్రం లోని అన్ని పాటలు  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అధ్భుతం గా  రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్ది మరియు జాగర్లమూడి సాయి బాబు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. 

భారీ వ్యయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. కంచె చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ