సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . బాహుబలి, రుద్రమదేవి వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో తో మన ముందుకు రానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న సైజ్ జీరో సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ లో గ్లామర్ తో పాటు భిన్నమైన భారీ లుక్ తో ఉన్న అనుష్కను చూసి ఆమె మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనుందని సినీ అభిమానులకు అర్థమైంది. దాదాపు నాలుగు మిలియన్స్ వ్యూవర్స్‌తో ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్నందిచిన ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి సంస్థ ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 27న తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని 1500 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.