Advertisementt

ఆర్‌జివి మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్నాడా?

Mon 19th Oct 2015 08:16 AM
ramgopal varma new movie killing veerappan,sivarajkumar,sandeep bharadwaj in killing veerappan,killing veerappan on 6th november  ఆర్‌జివి మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్నాడా?
ఆర్‌జివి మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్నాడా?
Advertisement
Ads by CJ

స్మగ్లర్‌ వీరప్పన్‌కి సంబంధించిన కథాంశంతో రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రం నవంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తెలుగు, తమళ్‌, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని బి.వి.మంజునాథ్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్‌ ట్రైలర్‌ని ఆదివారం విడుదల చేశారు. రామ్‌గోపాల్‌వర్మ మళ్ళీ తన ఒరిజినల్‌ స్టాండర్డ్స్‌లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడా అనిపించేలా ఈ ట్రైలర్‌ వుంది. కంప్లీట్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ని చూపిస్తూ రెడీ చేసిన ఈ ట్రైలర్‌లో చాలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. టేకింగ్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌తోనే తన సినిమాలను హిట్‌ చేసిన వర్మ మరోసారి ఆ మ్యాజిక్‌ని ఈ చిత్రంలో రిపీట్‌ చేస్తున్నాడు. 

వీరప్పన్‌కి సంబంధించిన కథ అనగానే అతని పుట్టు పూర్వోత్తరాల నుంచి ఎత్తుకోకుండా కేవలం అతని ఎండింగ్‌ డేస్‌కి సంబంధించిన కథాంశాన్ని మాత్రమే వర్మ తీసుకున్నాడు. వీరప్పన్‌ను చంపేందుకు ప్రభుత్వం చేపట్టిన కొకూన్‌ ఆపరేషన్‌ని నేపథ్యంగా తీసుకొని ఈ కథను రాసుకున్నాడు వర్మ. దానికి అతని మార్క్‌ స్క్రీన్‌ప్లే జోడించి ఈ చిత్రాన్ని తీశాడు. కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ