రామ్ చరణ్ బయటికి చెప్పడం లేదు కానీ... తన తండ్రి 150వ సినిమాకి సంబంధించిన పనుల్ని ఒకొక్కటిగా చక్కబెడుతున్నాడు. అన్నీ పక్కాగా సెట్ చేసుకొని ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి సినిమా వివరాల్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు చిరు కత్తి రీమేక్‌లో నటించేందుకే అంగీకారం తెలిపాడు. ప్రచారంలో ఉన్నట్టుగానే వినాయక్ దర్శకత్వంలోనే ఆ చిత్రం తెరకెక్కబోతోంది.
ఇప్పటికే వినాయక్ తన టీమ్‌తో కత్తి కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పించేశాడని సమాచారం. ఒరిజినల్‌గా కథ రాసిన మురుగదాస్‌తోనూ సంప్రదింపులు జరిపిన వినాయక్ కథలో కొన్ని కీలక మార్పులు చేసుకొన్నాడని తెలుస్తోంది. అంతే కాదు.. చిరు సరసన నటించాల్సిన హీరోయిన్ గురించి, విలన్ గురించి కూడా అన్వేషణ జరుపుతున్నాడట. హీరోయిన్ ఇంకా సెట్టవ్వలేదుకానీ... విలన్‌గా మాత్రం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని ఎంపిక చేసుకొన్నట్టు టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. తమిళ్ కత్తిలో విలన్‌గా నీల్ నితిన్ నటించాడు. కానీ చిరుకి తగ్గట్టుగా వివేక్ అయితేనే బాగుంటాడని చరణ్, వినాయక్ ఆయన్ని సెలెక్ట్ చేశారట.
వివేక్ ఒబెరాయ్‌కి తెలుగు చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధముంది. ఇప్పటికే రక్తచరిత్రలాంటి సినిమాలు చేశాడాయన. సో.. ఈ నేటివిటీకి తగ్గట్టుగా అల్లుకుపోయే సత్తా ఉంది కాబట్టి వివేక్‌ని ఎంపిక చేశారట. పైగా రామ్‌చరణ్‌కి వివేక్ ఒబెరాయ్‌తో మంచి అనుబంధముంది. దీంతో ఆయన్ని సంప్రదించడం, ఒకే అనడం చకచకా జరిగిపోయాయట. ఇక హీరోయినే సెట్‌కావల్సి వుంది. హీరోయిన్‌ని కూడా బాలీవుడ్ నుంచి ఓ ముదురు భామని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. మొత్తమ్మీద దసరాలోపే చరణ్ డాడీ 150వ సినిమాని ప్రకటించే అవకాశాలున్నాయి.