రుద్ర, వెన్నెల, సంజయ్ ప్రధాన పాత్రల్లో శివకృతి క్రియేషన్స్ పతాకంపై కిరణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం వీరి వీరి గుమ్మడిపండు. ఎం.వి.సాగర్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో మధురా శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా...
మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రబృందంతో నాకు మంచి పరిచయం ఉంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కిరణ్ కుమార్ గారు సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేసి సినిమాల మీద ఇంట్రెస్ట్ తో నిర్మాణ రంగంలోకి దిగారు. ఈ సినిమా పాటలు విన్నాను. చాలా బావున్నాయి. ట్రైలర్ ను ఎనర్జిటిక్ గా తీసారు. ఈ సినిమాతో నిర్మాతకు మంచి లాభాలు వచ్చి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ మంచి కథతో సినిమా చేయాలని సాగర్ కు చెప్పాను. తను నాలుగు నెలల సమయం తీసుకొని నాకు స్టొరీ వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం. ప్రీప్రొడక్షన్ పనులు నాలుగు నెలలు చేసాం. 35 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనుకున్నాం కాని 32 రోజుల్లోనే పూర్తి చేసేసాం. టీం ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది.. అని చెప్పారు.
రుద్ర మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా ఓ మంచి అవకాసం కోసం ఎదురు చూసాను. సాగర్ గారు పిలిచి చాన్స్ ఇచ్చారు. కథ వినగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. సినిమా బాగా వచ్చింది. ఇదొక యూనిక్ మూవీ. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.. అని చెప్పారు.
సంజయ్ మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలవాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
ఎం.వి.సాగర్ మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం ఓ కుటుంబానికి జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని దానికి సినిమా హంగులు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమాలో 5 పాటలుంటాయి. మంచి మ్యూజిక్ కుదిరింది. 32 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అని చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.ఎమ్.కృష్ణ, మ్యూజిక్: పి.ఆర్, ఎడిటర్: శక్తి స్వరూప్, డి.ఐ.భానుప్రకాష్, ఆడియోగ్రఫీ: జయంత్ సురేష్, సౌండ్ ఎఫెక్ట్స్: కృష్ణ, ప్రొడ్యూసర్: కెల్లం కిరణ్ కుమార్, డైరెక్టర్: ఎమ్.వి.సాగర్.