Advertisementt

పున్నమిరాత్రి విడుదలకు సిద్ధం!

Mon 19th Oct 2015 08:40 AM
punnamirathri movie release date,shraddhadas,subbareddy  పున్నమిరాత్రి విడుదలకు సిద్ధం!
పున్నమిరాత్రి విడుదలకు సిద్ధం!
Advertisement
Ads by CJ

శ్రద్ధాదాస్, మోనాల్ గజ్జార్, శ్వేతబాసుప్రసాద్ ప్రధాన పాత్రల్లో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వినయన్ దర్శకత్వం వహించిన చిత్రం పున్నమిరాత్రి. నిర్మాత ఎం.సుబ్బారెడ్డి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

శోభారాణి మాట్లాడుతూ.. సుబ్బారెడ్డి, సిరాజ్ లతో మా సంస్థకు మంచి అనుబంధం ఉంది. డ్రాకులా గురించి ఎప్పుడు ఎలాంటి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరించారు. ఈ మధ్య అలాంటి చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ను ఆధారం చేసుకొని సుబ్బారెడ్డి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. చక్కటి సంగీతం కుదిరింది. శ్రద్ధాదాస్ డ్రాకులా చుట్టూ తిరిగే ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. మొదటిసారి తెలుగులో 3డి లో వస్తున్న హారర్ చిత్రమిది. నేను సినిమా చూసాను. చాలా ఎఫక్టివ్ గా ఉంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆడుమగాడ్రబుజ్జి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ నిర్మాణ రంగం మొదలుపెట్టాం. పున్నమిరాత్రి మా ప్రొడక్షన్ లో వస్తున్న రెండో చిత్రం. 3డి తో పాటు 2డి లో కూడా ఈ సినిమాను తీసాం. అక్టోబర్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

సహనిర్మాత సిరాజ్ మాట్లాడుతూ.. 3డి థియేటర్ల కోసం ఎదురు చూసాం. రుద్రమదేవి చిత్రంతో 150 3డి థియేటర్లు వచ్చాయి. అక్టోబర్ 30 న విడుదల చేయనున్నాం. 2డి, 3డి లో వస్తున్న హారర్ సినిమా ఇది. 3డి నే ఈ సినిమాకు హీరో.. అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ రఘురాం మాట్లాడుతూ.. హై ప్రొడక్షన్ వాల్యూస్ తో వస్తున్న ఈ సినిమాకు సంగీతం అందివ్వడం సంతోషంగా ఉంది. రెండు పాటలు కంపోజ్ చేసాను. టైటిల్ సాంగ్ బాగా కుదిరింది. ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజీవ్ రామా, ప్రొడక్షన్ కంట్రోలర్: నాగేంద్ర గాధంశెట్టి, సినిమాటోగ్రఫీ: సతీష్ బాబు, సంగీతం: భబిత్ జార్జ్, రఘురాం, సహనిర్మాత: సిరాజ్, నిర్మాత: ఎం.సుబ్బారెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వినయన్.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ