హీరోలు తెర మీద ఎన్ని పంచులు వేసినా తెర వెనక రచయితలు, దర్శకులు అలాంటి పదునైన పదాలు రాస్తేనే ఇలా మనం ఆనందించేది. బెంగాల్ టైగర్ చిత్రం కోసం సంపత్ నంది రాసిన ఓ డైలాగ్ ప్రస్తుతానికి సంచలనం రేపుతోంది. నిన్నే పాటల పండగ జరుపుకున్న ఈ మాస్ మహారాజ్ చిత్రం యొక్క టీజర్లో హీరో రవితేజ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా నేను సపోర్టుతో పైకొచ్చినవాణ్ని కాదు. సోలోగా పైకొచ్చిన వాణ్ని అని సంపత్ నంది కలం నుండి జాలువారిన ఓ లైన్ ఇప్పుడు మిగతా స్టార్ హీరోల అభిమానులకు అంతలా రుచించడం లేదు.
నిజానికి తెలుగు పరిశ్రమ మొత్తం వారసత్వం ఉన్న హీరోలతోనే నిండి పోయింది. తాతలో తండ్రులో మావయ్యలో బావయ్యలో గాడ్ ఫాదరుగా లేకపోతే చాల మంది హీరోలు ఈపాటికి బిచానా సర్దేసే వారే. మరి ఇటువంటి అభిప్రాయాలుంటే మనసులో దాచుకోవాలి గానీ అలా నిర్భయంగా మాట్లాడేస్తే ఎలా. సెటైర్లు వేయడానికి ఎవరూ వెనకాడకపోయినా, రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ పంచుతో తెగ సంబర పడిపోతున్నారు.
అలాగే నన్ను చంపే కత్తి కానీ, గన్ను కానీ తయారవలేదు. మేక్ యాన్ ఆర్డర్ అని మరో పవర్ ఫుల్ డైలాగ్ మాస్ రాజాతో చెప్పించాడు సంపత్. బెంగాల్ టైగర్ సరంజామా చూస్తుంటే మాస్ అభిమానులకు పండగే పండగలా అనిపించట్లేదు.