యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి అండ్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో.. ఈ చిత్రం టీజర్‌ను విజయదశమి కానుకగా అక్టోబర్ 21 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - విజయదశమి కానుకగా నాన్నకు ప్రేమతో.. టీజర్‌ని రేపు(అక్టోబర్ 21) సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు లండన్‌లో భారీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు నవంబర్ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజుల పాటు మరో భారీ షెడ్యూల్ చెయ్యబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.