సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్టీ చక్రవర్తి ప్రధానపాత్రల్లో ఏ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం కొలంబస్. ఆర్.సామల దర్శకుడు. అక్టోబర్ 22న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో..
ఎమ్.ఎస్.రాజు మాట్లాడుతూ..ఈ విజయదశమి నాకు చాలా ప్రత్యేకమైనది. 25 సంవత్సరాల క్రితం అక్టోబర్ నెలలోనే నేను సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఈ సంవత్సరంలో నా కొడుకు కేరింత, కొలంబస్ చిత్రాలతో రెండు పెద్ద గిఫ్ట్స్ ఇచ్చాడు. అశ్విన్ కెరీర్ లో బెస్ట్ హిట్ కొలంబస్. నవంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న రిలీజ్ చేయాలనే సంకల్పంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా విడుదల చేసాం. సినిమా సెకండ్ హాఫ్ బావుందని అందరు చెబుతున్నారు. ఈ క్రెడిట్ అంతా నిర్మాత అశ్వనికుమార్ గారికే చెందుతుంది. సినిమాల మీద ప్యాషన్ తో కొలంబస్ చిత్రాన్ని నిర్మించారు. నేను ఇచ్చిన కథను, స్క్రీన్ ప్లే ను రమేష్ అధ్బుతంగా డైరెక్ట్ చేసాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. సుమంత్ అశ్విన్ తన పాత్రకు న్యాయం చేసాడు. అలానే సీరత్ ఓ ముఖ్యమైన పాత్రలో అధ్బుతంగా నటించింది. జితిన్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.. అని చెప్పారు.
అశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. నా ప్రొడక్షన్ లో మొదటి సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.
రమేష్ సామల మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా రాజు గారి సినిమాలు చేస్తున్నారు. ఆయనతో పని చేసే అవకాసం రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద డెబ్యూ మూవీ ఎవరికీ వచ్చి ఉండదు.. అని చెప్పారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వెంటనే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఇంత మంచి సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. నిర్మాత అశ్వనికుమార్ గారు లేకపోతే ఈ సినిమా దసరా కు రిలీజ్ అయ్యేది కాదు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి థాంక్స్.. అని చెప్పారు.
సీరత్ కపూర్ మాట్లాడుతూ.. నేను నీరు పాత్ర చేయగలనని నమ్మి ఈ అవకాసం ఇచ్చిన ఎమ్.ఎస్.రాజు గారికి థాంక్స్. సుమంత్ సపోర్టివ్ కో యాక్టర్. అందరం కష్టపడి చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జితిన్ రోషన్, భాస్కర్ సామల, కె.వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుమంత్ అశ్విన్, సీరత్‌కపూర్, మిస్టీ చక్రవర్తి, రోషన్, సప్తగిరి, నాగినీడు, రోహిణి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జితిన్ రోషన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జె.బి, సినిమాటోగ్రఫీ: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, నిర్మాత: అశ్వనికుమార్ సహదేవ్, కథ, స్క్రీన్‌ప్లే, సూపర్‌విజన్: యం.యస్.రాజు, మాటలు, దర్శకత్వం: ఆర్.సామల.