నవంబర్ 2న మాంజ పాటలు విడుదల!
ఉయ్యాలా జంపాలా, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ చిత్రాల విజయాలతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా భాసిల్లుతున్న అవికాగోర్ నటిస్తున్న తాజా చిత్రం మాంజ తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో కిషన్ ఎస్.ఎస్, ఈషా డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆటకైనా వేటకైనా అనే ఉపశీర్షికతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కిషన్.ఎస్.ఎస్ దర్శకుడు. రాజ్‌కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలను నవంబరు 2న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గిరిధర్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ..ఇదొక భావోద్వేగపూరితమైన సినిమా.ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. నిజానికి దగ్గరగా వుండే సినిమా. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అవికా చాలా సహజంగా నటించింది. ఇందులో ఆమె ఛాలెంజ్‌గా భావించదగ్గ పాత్రలో చేసింది. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్‌కు మన దేశం తరుపున వెళ్లినందుకు ఆనందంగా వుంది. కిషన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. నవంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్, మనోజ్ శ్రీహరి, కిషన్‌ఎస్‌ఎస్, పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మీ, సురేష్ గంగుల; సంభాషణలు: వంశీ చంద్ర వట్టికూటి, మ్యూజిక్ ప్రొడ్యూసర్: వినయ్ పాటిల్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాంబాబు కుంపట్ల.