Advertisementt

స్వాతి హంగామా షురూ!

Mon 26th Oct 2015 09:25 AM
swati,tripura,tripura movie,raj kiran  స్వాతి హంగామా షురూ!
స్వాతి హంగామా షురూ!
Advertisement
Ads by CJ


హార్ర‌ర్ కామెడీ జోన‌ర్ సినిమాలు టాలీవుడ్‌కి బాగా అచ్చొచ్చాయి. ఒక మాదిరిగా న‌వ్వించినా, ఒక మాదిరిగా భ‌యపెట్టినా ప్రేక్ష‌కులు ఆ సినిమాల్ని విజ‌య‌తీరాల‌కి చేరుస్తున్నారు. అందుకే ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా హార్ర‌ర్ కామెడీని సేఫ్ జోన‌ర్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. పైగా వాటికి అయ్యే బ‌డ్జెట్ కూడా త‌క్కువే. ప్ర‌మోష‌న్ బాగా చేసుకొంటే స‌రిపోతుందంతే. హార్ర‌ర్ కామెడీ సినిమాలు తీసి ఎలా విజ‌యం సాధించొచ్చో టాలీవుడ్  ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బాగా తెలుసుకొన్నారు. అందుకే ఆ జోన‌ర్ సినిమాలు త‌ర‌చుగా సెట్స్‌పైకి వెళుతుంటాయి. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన  రాజుగారి గ‌ది మంచి రిజ‌ల్ట్‌తో ర‌న్ అవుతోంది. ఇప్పుడు ఆ త‌ర‌హాకి చెందిన మ‌రో చిత్రం టాలీవుడ్‌ని ఊరిస్తోంది. అదే మ‌న అల్ల‌రిపిల్ల స్వాతి న‌టించిన త్రిపుర‌. గీతాంజ‌లి ఫేమ్ రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నాయి. ఓవ‌ర్సీస్ బిజినెస్ కూడా సినిమాని సెట్స్‌పై ఉన్న‌ప్పుడేపూర్తి చేసుకొంది. ఇటీవ‌లే త్రిపుర ఫ‌స్ట్‌కాపీ రెడీ అయిపోయింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ఓ ల్యాబ్‌లో చిత్ర‌బృందం  సినిమాని ప్ర‌త్యేకంగా చూసుకొంది. సినిమా ఔట్‌పుట్ బాగుండ‌టంతో ప్ర‌మోష‌న్‌ని పెద్ద‌యెత్తున చేయాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలిసింది. అద‌నంగా బ‌డ్జెట్ కేటాయించి ఓ రేంజ్‌లో ప్ర‌మోష‌న్ చేయాల‌ని అనుకొంటున్నార‌ట‌. ఈ సినిమాని తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీల్లోనూ  విడుద‌ల చేయ‌బోతున్నారు. త‌మిళ్‌, మ‌ల‌యాళంలో స్వాతికి మంచి మార్కెట్ ఉంది. కంటెంట్ కొత్త‌గా ఉండ‌టంతో హిందీకి కూడా తీసుకెళ్లాల‌ని ఫిక్స‌యిపోయారు. రేపోమాపో రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. స్వాతి మాత్రం ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకొంది. ఈసినిమా త‌ర్వాత త‌న కెరీర్ మ‌లుపు తిరుగుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉంద‌ట‌. మ‌రి ఆమె ఆశ‌లు ఎంత వ‌రకు ఫ‌లిస్తాయో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ