హీరోగా రామ్ చరణ్ వేస్తున్న ప్రతి అడుగు వెనకాల చిరంజీవి ఆపన్న హస్తం ఉందన్న విషయం ఈ పాటికే తెలుగు ప్రేక్షక లోకానికి మొత్తం అర్థమయింది. హిట్టోచ్చినప్పుడు పొగడడం, ఫ్లాపొచ్చినప్పుడు ఉతికి ఆరేయడం మనకు అలవాటే. ఇప్పుడు బ్రూస్ లీ ఫ్లాప్ టాక్ చిరంజీవికి ఇబ్బందిగా మారింది. సినిమా తీసింది శ్రీను వైట్ల అయినా నటించింది రామ్ చరణ్ అయినా, ఓటమి భారం మాత్రం విశ్లేషకులు మొత్తంగా చిరంజీవి మీదే నూకి పారేస్తున్నారు. మెగా స్టార్ ఇంకా ఎనభయ్యో దశకం ఆలోచనల్లోనే ఉన్నాడని, అందుకే చరణ్ చేత బ్రూస్ లీ లాంటి పనికి రాని చిత్రాలు సంతకం చేయిస్తున్నాడని విశ్లేషకులు చేస్తున్న కామెంట్స్ విని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు అభిమానులు.
ఇదే సమయంలో వారి కుటుంబానికే చెందిన వరుణ్ తేజ్ కంచె లాంటి పరిశోధనాత్మక సినిమాతో విమర్శకుల మనసులు మెప్పిస్తూ ఉండడంతో ఒక వైపు మెగా అభిమానులు ఆనందంలో ఉన్నా, రామ్ చరణ్ కూడా బ్రూస్ లీతో విజయం సాధించి ఉంటె కథ ఇంకో రకంగా ఉండేది. ఏది ఏమైనా దెబ్బ తగిలినప్పుడే ఆయింట్మెంట్ పెట్టినట్టు బ్రూస్ లీ చేసిన గాయానికి చిరంజీవిని దోషిగా నిలబెడుతున్నారు కాబట్టి ఆయనే రామ్ చరణ్ కెరీరుకు ఆయింట్మెంట్ తగిలించి బండిని దారిలో పెట్టాలి.