Advertisementt

నవంబర్ లో వస్తున్న బుల్లెట్ రాణి!

Tue 27th Oct 2015 08:36 AM
bullet rani press meet,priyanka kothari,sajid kureshi  నవంబర్ లో వస్తున్న బుల్లెట్ రాణి!
నవంబర్ లో వస్తున్న బుల్లెట్ రాణి!
Advertisement
Ads by CJ

ప్రియాంక కొఠారి ప్రధాన పాత్రలో ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌ పతాకంపై సాజిద్ ఖురేషి దర్శకత్వంలో ఎం.ఎస్‌.యూసఫ్‌ నిర్మిస్తున్న చిత్రం బుల్లెట్ రాణి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు సాజి ఖురేషి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొంది. గబ్బర్ సింగ్ సినిమా నుండి స్టైల్ ను, దూకుడు సినిమా నుండి టాలెంట్ ను, విక్రమార్కుడు సినిమా నుండి హానేస్టీ ను తీసుకొని కథ రాసుకున్నాను. లంచగొండితనాన్ని ఎదిరించి పోరాడే ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ కథే ఈ సినిమా. ప్రియాంక తన పాత్రలో అధ్బుతంగా నటించింది. బుల్లెట్ రాణి పాత్రలో తను చెప్పే నో జడ్జిమెంట్ ఓన్లీ పనిష్మెంట్ అనే డైలాగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. నవంబర్ చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

ప్రియాంక కొఠారి మాట్లాడుతూ.. ఈ సినిమాలో బుల్లెట్ రాణి అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాను. దైర్యంగా, నీతి నిజాయితీల బాటలో నడిచే క్యారెక్టర్ అది. డైరెక్టర్ గారు క్లియర్ విజన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన లేకపోతే సినిమా ఇంతబాగా వచ్చేది కాదు. సాజిత్ గారితో పని చేయడం అద్రుష్టంగా భావిస్తున్నాను.. అని చెప్పారు.

ఆశిష్‌ విద్యార్ధి, షఫి, తాగుబోతు రమేష్‌, రవి కాలె, అమిత్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: వి.సురేష్‌కుమార్‌, డైలాగ్స్: జి.నాగేశ్వరావు,  యాక్షన్‌: థ్రిల్లర్‌ మంజు, డ్రాగన్ ప్రకాష్, మాస్ మధ, కెమెరా: ఏ.ఎం.సెల్వం, మ్యూజిక్‌: గున్వంత్‌, నిర్మాత: ఎం.ఎస్‌.యూసఫ్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సాజిద్ ఖురేషి!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ