Advertisementt

త్రిపుర ఆడియో విశేషాలు!

Fri 30th Oct 2015 02:48 PM
tripura audio launch,rajakiran,swathi,naveen chandra  త్రిపుర ఆడియో విశేషాలు!
త్రిపుర ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో చినబాబు నిర్మిస్తున్న చిత్రం త్రిపుర. ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను క్రిష్ జాగర్లమూడి కి అందించారు. ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. దర్శకుడు అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఏ దర్శకుడైనా సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినంత సంతోషపడతాను. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో క్రిష్, రాజమౌళి, శేఖర్ కమ్ముల లంటే నాకు చాలా ఇష్టం. గీతాంజలి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాజకిరణ్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కేవలం డైరెక్టర్ వలనే గీతాంజలి సినిమా పెద్ద సక్సెస్ అయింది. నేను డైరెక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడతానని నన్ను అందరు తిట్టుకుంటూ ఉంటారు. ఒకసారి స్టేజి మీద నాకు నటుడు శివాజీగణేషన్ కు ఈ విషయంలో వాదన జరిగింది. డైరెక్టర్ అనేవాడు చాలా మంది యాక్టర్స్ ను తయారుచేయగలడు కాని యాక్టర్, డైరెక్టర్ ను క్రియేట్ చేయలేడని చెప్పాను. దర్శకుడు కమాండర్ గా ఉండాలి కానీ హీరో మోకాళ్ళ దగ్గర ఉండకూడదు. త్రిపుర చిత్రానికి చాలా క్రేజ్ వచ్చింది. బిజినెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అభిషేక్ పిక్చర్స్ వారు నైజాంలో 300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా చూసిన వారంతా చాలా బాగా తీసారని చెబుతున్నారు. ట్రైలర్ బావుంది. ఓపెనింగ్స్ బాగా వస్తాయి. కలర్స్ స్వాతి స్క్రీన్ ప్రెజన్స్ బావుంటుంది. తన  కళ్ళతో చక్కగా నటిస్తుంది. అలా కళ్ళతో నటించే మరో నటి  నిత్యామీనన్. బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల నుండి ప్రేక్షకులు సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. దసరా కు రిలీజ్ అయిన మూడు చిత్రాలు మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. చిన్న చిత్రాలు ఆడితే ఇండస్ట్రీకు పండగే. చిన్న సినిమా అని బడ్జెట్ చూసి అంటున్నాం కానీ అది హిట్ అయితే పెద్ద సినిమానే. ఈరోజు పెద్ద సినిమాలకు ఎలాంటి లాభాలు ఉండట్లేదు. త్రిపుర చిన్న చిత్రమయినా టేబుల్ ప్రాఫిట్ లో ఉంది. తమిళంలో శైవం లాంటి మంచి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. త్రిపుర తో మంచి లాభాలోచ్చి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పటివరకు గోస్ట్ జోనర్ లో సినిమాలు చేయలేదు. ఆ జోనర్ వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరు చూడగలిగే జోనర్ ఇది. నవీన్ చంద్ర అందాల రాక్షసి లో నటించక ముందు నుండే నాకు తెలుసు. తనను మొదట చూడగానే నచ్చేసాడు. పస్తుతం వారసత్వంతో హీరోలు అవ్వడమే తప్ప కొత్తవారికి అవకాశాలు దొరకట్లేదు. అలాంటి పరిస్థితులన్నీ దాటుకొని నవీన్ చంద్ర రాగలిగాడంటే గొప్ప విషయం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు స్కోప్ ఉన్న సినిమా. పాటలు బావున్నాయి. కామ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి పని చేసిన  టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు నా అభినందనలు.. అని చెప్పారు.

క్రిష్ మాట్లాడుతూ.. నాకు దయ్యాల సినిమాలంటే చాలా భయం. కాని గీతానజలి సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చూసాను. ఆ చిత్ర దర్శకుడే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలను దాసరి నారాయణరావు గారు ప్రోత్సహించే విధానం, ఆయనకుండే మక్కువ, అభిమానం వలనే చిన్న చిత్రాలు బ్రతుకుతున్నాయి. గీతాంజలి సినిమాలో ట్విస్టులు నచ్చి ఆ సినిమా టీం లో భాగమయ్యాను. నిజానికి గీతాంజలి చిత్రానికి త్రిపుర అనే టైటిల్ పెట్టాలనుకున్నాం కాని కొన్ని కారణాల వలన అది కన్ఫర్మ్ చేయలేదు. అప్పుడు డైరెక్టర్ గారు టైటిల్ దాచుకున్నారనుకున్నాను. కాని బ్రాహ్మాస్త్రం లాంటి స్క్రిప్ట్ దాచుకున్నారనుకోలేదు. కథ నచ్చే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే చేసాను. కామ్రాన్ లో మంచి స్పార్క్ ఉంది. మ్యూజిక్ బాగా చేసాడు. గీతాంజలి సినిమాలో స్వాతి నటించాల్సివుంది కాని డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈ సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర అధ్బుతంగా నటించారు.. అని చెప్పారు.

కామ్రాన్ మాట్లాడుతూ.. గీతాంజలి సినిమాకు బ్వ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాను. ఆ సినిమా వలనే నాకు ఈ చిత్రానికి మ్యూజిక్ అందించే అవకాసం లభించింది.. అని చెప్పారు.

రాజకిరణ్ మాట్లాడుతూ.. కోన వెంకట్ గారు నాకు అవకాసం ఇవ్వడం వలనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వెలిగొండ, కోన ల స్క్రీన్ ప్లే, కామ్రాన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. స్వాతి క్లైమాక్స్ లో అధ్బుతంగా నటించింది. నవీన్ చంద్ర నటన చూస్తే అంతపురం సినిమాలో జగపతి బాబు గారు గుర్తొచ్చారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. అని చెప్పారు.

చినబాబు మాట్లాడుతూ.. మా సినిమాను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాను నవంబర్ 6న మొత్తం 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. నైజాం ఒక్క ప్రాంతంలోనే 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం.. అని చెప్పారు.

స్వాతి మాట్లాడుతూ.. పాజిటివ్ ఎనర్జీ తో ఈ సినిమాకు అందరం పని చేసాం. కామ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: రాజా, స్ర్కీన్ ప్లే: శ్రీనివాస్ వెలిగొండ, కోన వెంకట్, సంగీతం: కమ్రాన్, కెమెరా: రవికుమార్ సానా, నిర్మాత: చినబాబు, రచన-దర్శకత్వం: రాజ కిరణ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ