సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ప్రధానపాత్రల్లో ఏ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం కొలంబస్. ఆర్.సామల దర్శకుడు. అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ చిత్రం విడుదలయ్యింది. సినిమాకు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. శనివారం హైదరాబాద్ లోని చిత్రబృందం ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా..
ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ.. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. అని చెప్పారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. కొలంబస్ సినిమా హిట్ అయ్యి ఈరోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎం.ఎస్.రాజు గారి కుటుంబం అంటే నా కుటుంబం లాంటిది. ఆయనే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసారు. సుమంత్ నాకు బ్రదర్ లాంటివాడు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ఎందరో దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు బ్రేక్ ఇచ్చిన బ్యానర్. టీం అందరికి అభినందనలు.. అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ.. సుమంత్ అశ్విన్ మినిమం గ్యారంటీ హీరోలా.. క్వాలిటీ ఫిల్మ్స్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్స్ కు హిట్ వస్తే మరిన్ని కొత్త ఐడియాస్ తో సినిమాలు చేసే అవకాశాలుంటాయి. ఎం.ఎస్.రాజు గారి దగ్గర ఒక సినిమాకు పని చేస్తే 10 సినిమాలకు పని చేసిన అనుభవం వస్తుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్ అందరికి కంగ్రాట్స్.. అని చెప్పారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. జితిన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జె.బి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. లిరిక్స్ కూడా బాగా కుదిరాయి. టెక్నీషియన్స్ అందరికి థాంక్స్.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రమేష్ సామల, జితిన్, భాస్కర్ భట్ల, జె.బి, ఇంద్ర, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.