Advertisementt

‘కుమారి 21 ఎఫ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Sat 07th Nov 2015 06:19 PM
kumari 21f,kumari 21 f release date,sukumar kumari 21f movie release details,kumari 21 f movie  ‘కుమారి 21 ఎఫ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘కుమారి 21 ఎఫ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నాడు.  రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం  ఈ నెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ 'ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది. ఇటీవల  విడుదల చేసిన పాటలకు, ట్రైలర్ కు  చక్కని స్పందన వస్తోంది. టీజర్ విడుదల దగ్గర నుండి నేటి వరకు హాట్ టాపిక్ గా నిలిచిన ఈ చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 20 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' ..అని తెలిపారు. 

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ