Advertisementt

'ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారంటీ' ఆడియో విశేషాలు!

Mon 09th Nov 2015 01:22 PM
ee cinema super hit guarantee audio release,mahadev,chandu muddu  'ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారంటీ' ఆడియో విశేషాలు!
'ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారంటీ' ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

హెచ్‌.హెచ్‌.మహదేవ్‌, ఐశ్వర్య అడ్డాల, సిరిశ్రీ, పునర్ణవి భూపాలం ప్రధానపాత్రల్లో  పి.యస్‌.త్రిలోక్‌ రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. బ్యానర్‌పై చెందు ముద్దు దర్శకత్వంలో పి.యస్‌.సూర్యతేజా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారంటీ'. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని జరిగింది.  ఆర్‌.పి.పట్నాయక్‌ బిగ్‌ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ.. '\ఇలాంటి టైటిల్ పెట్టాలంటే చాలా దైర్యం ఉండాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్. టైటిల్ లానే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. వంశీ గారు మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో రెండు పాటలకు సంగీతం అందించాను''అని చెప్పారు.

సంగీత దర్శకుడు మారుతీరాజా మాట్లాడుతూ.. ''నాపై నమ్మకంతో ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అని అన్నారు. 

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ''కథ వినగానే శ్రీరాంరెడ్డిగారు సినిమా చేయమని ప్రోత్సహించారు. ఆయన ఈరోజు లేకపోవడం చాలా బాధగా ఉంది. వంశీగారు ఎంతో అభిమానంతో ఈ సినిమాలో రెండు పాటలకు సంగీతం అందిచడం అదృష్టంగా భావిస్తున్నాను. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అని చెప్పారు. 

హెచ్‌.హెచ్‌.మహదేవ్‌ మాట్లాడుతూ.. ''సినిమా బాగా వచ్చింది. డిఫరెంట్‌గా చేసిన సినిమా ఇది. డైరెక్టర్‌ చెందుగారి దర్శకత్వంలో నేను వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. టెక్నిషియన్స్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ''సినిమా చూసి బాగా ఎంజాయ్‌ చేశాను. కథ కొత్తగా ఉంది. చెందు  మంచి టాలెంటెడ్‌ పర్సన్‌. తను మంచి కథతో వస్తే మా బ్యానర్‌లో కూడా నేను సినిమా చేస్తాను. వంశీ, మారుతీరాజాగారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు'' అని చెప్పారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మహదేవ్‌ లుక్ చాలా బావుంది. ఈ బ్యానర్‌లో మరిన్ని మంచి సినిమాలు రావాలి. మహదేవ్‌ స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో త్రినాథరావు, పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి,  గోపి గణేష్‌,  క్రాంతిమాధవ్‌, రవివర్మ, చంద్రమహేష్‌, స్టీఫెన్‌ శంకర్‌, కాశీవిశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: వంశీ-మారుతీరాజా, ఎడిటింగ్‌: వినయ్‌, లిరిక్స్‌: శ్రీరామ్‌ తపస్వి, కెమెరా: జయపాల్‌రెడ్డి నిమ్మల, కో ప్రొడ్యూసర్‌: పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, ప్రొడ్యూసర్‌: పి.యస్‌.సూర్యతేజారెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెందు ముద్దు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ