Advertisementt

బాలయ్య.. సంక్రాంతి కి పక్కా..!

Wed 11th Nov 2015 08:51 PM
balakrishna,dictator,sankranthi,sriwas,anjali  బాలయ్య.. సంక్రాంతి కి పక్కా..!
బాలయ్య.. సంక్రాంతి కి పక్కా..!
Advertisement
Ads by CJ

సంక్రాంతికి వస్తున్న నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’  

                                                  – కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘’సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లోనూ విడుదల చేయాలని మా సంకల్పానికి బాలయ్యగారు పూర్తి సహాయ సహకారాలందించారు. ప్రతి క్షణం ఆయన అందించిన మద్దతుతోనే  సినిమా షూటింగ్ చాలా కూల్ గా ఎటువంటి ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతుంది. అలాగే సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతున్నాం.  ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రెండు పాటలు, రెండు ఫైట్స్, డిల్లీలో చిత్రీకరించాల్సిన కొన్ని సీన్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబ‌ర్ లో ఆడియో విడుదల చేసి సినిమాను సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’.. అన్నారు.

సుమన్, పవిత్రా లోకేష్, నాజర్, వెన్నెలకిషోర్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, హేమ, కబీర్, విక్రంజీత్, అజయ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం, కథ-స్క్రీన్ ప్లే: కోనవెంకట్-గోపిమోహన్, నిర్మాత: ఈరోస్ఇంటర్నేషనల్, కో ప్రొడ్యూసర్, దర్శకత్వం: శ్రీవాస్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ