Advertisementt

శంకరాభరణం రిలీజ్ డేట్ ఫిక్స్!

Fri 13th Nov 2015 03:41 PM
shankarabharanam movie release date,kona venkat,nikhil,nanditha  శంకరాభరణం రిలీజ్ డేట్ ఫిక్స్!
శంకరాభరణం రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, కామెడీ చిత్రం శంకరాభరణం. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంక‌ట్ ఈ చిత్రానికి ర‌చ‌న చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

కోన వెంకట్ మాట్లాడుతూ.. ''మే నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సినిమా పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. నా కెరీర్ లో 'డీ' ఒక మైల్డ్ స్టోన్ చిత్రం. ఆ సినిమా రిలీజ్ అయ్యి సుమారుగా పది సంవత్సరాలయ్యింది. ఆ చిత్రం తరువాత మరో కొత్త అధ్యాయానికి తెర తీసే చిత్రం శంకరాభరణం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం సాయి శ్రీరాం. వంద లోకేషన్స్ లో షూట్ చేసాం. ప్రతి విజువల్ అధ్బుతంగా వచ్చేలా చేసాడు సాయి శ్రీరాం. హిందీలో ఫస్ గయా రే ఒబామా సినిమా చూసి ఒక ఐడియా తీసుకొని దాని చుట్టూ కథ అల్లాను. చాలెంజింగ్ బ్యాక్ డ్రాప్, చాలెంజింగ్ స్క్రీన్ ప్లే, చాలెంజింగ్ స్క్రిప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి హీరోగా నిఖిల్  మాత్రమే న్యాయం చేయగలడని సెలెక్ట్ చేసుకున్నాను. గౌతమ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. నందిత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. తెలుగు చిత్రాలు కూడా బాలీవుడ్ స్థాయిలో తీయగలమని చెప్పే సమాధానమే ఈ శంకరాభరణం. నవంబర్ 15న వైజాగ్ లో సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నాం'' అని చెప్పారు. 

నిఖిల్ మాట్లాడుతూ.. ''కోన గారు పిలిచి కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. డిఫరెంట్ జోనర్ లో ఉంటూ.. కోన గారి సినిమాల్లో ఉండే హ్యూమర్ మిస్ కాకుండా ఉంటుంది. టీం ఎఫర్ట్ తో చేసిన సినిమా ఇది. ఈ బ్యానర్ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

నందిత మాట్లాడుతూ.. ''ప్రేమ కథా చిత్రం తరువాత ఓ డిఫరెంట్ జోనర్ లో మంచి సినిమా చేయాలనుకున్నాను. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చింది. ప్రవీణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందరికి సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.

ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదలయిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 15న ట్రిపుల్ ప్లాటినం డిస్క్ కార్యక్రమం చేయనున్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కష్టపడి చేశాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఉదయ్ నందనవనం, శ్రీజో, సాయి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం, ఆర్ట్: చిన్న, మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు, లిరిక్స్: శ్రీజో, దర్శకుడు: ఉదయ్ నందనవనం, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ