Advertisementt

మహేష్ వస్తున్నాడంటే మంచి రోజేగా!

Sat 14th Nov 2015 07:49 PM
bhale manchi roju audio,mahesh babu guest,sudheer babu  మహేష్ వస్తున్నాడంటే మంచి రోజేగా!
మహేష్ వస్తున్నాడంటే మంచి రోజేగా!
Advertisement
Ads by CJ

'ప్రేమ‌ క‌థా చిత్రం', 'కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని' లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'భ‌లేమంచిరోజు'. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే... నవంబర్ 25న 'శ్రీమంతుడు' చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా భలే మంచి రోజు చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు. మహేష్ బాబు, సుధీర్ బాబు అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖుల సమక్షంలో భలే మంచి రోజు ఆడియోను గ్రాండ్ గా విడుదల చేసేందుకు నిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు.  

ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ''సుధీర్‌బాబు, వామిఖ జంట‌గా మా మిత్రుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న భలే మంచి రోజు చిత్ర టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ టీజర్ విడుదల తర్వాత సినిమాకు భలే క్రేజ్ వచ్చింది. ఇదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ...నవంబర్ 25న సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా భలే మంచి రోజు పాటల్ని విడదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ అభిమానులతో పాటు.. సినీ పరిశ్రమ పెద్దలు హాజరు కానున్నారు. 'స్వామిరారా', 'ఉయ్యాల జంపాల' చిత్రాల‌కి సంగీతం అందించిన స‌న్ని.య‌మ్‌.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. ఒక్క రోజులో జ‌రిగే క‌థ‌నంతో ఆద్యంతం ఆసక్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో తెర‌కెక్కించాం. 'ఉత్త‌మ‌విల‌న్‌',' విశ్వ‌రూపం' చిత్రాల‌కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన షామ్‌ద‌త్‌(shamdut) సినిమాటోగ్ర‌ఫి అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తాం'' అని అన్నారు

ఈ చిత్రానికి కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌.ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్ రెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ