Advertisementt

'డా||చక్రవర్తి' సినిమా ప్రారంభం!

Wed 18th Nov 2015 07:02 PM
doctor chakravarthy movie opening,sekhar soori,venkateshwarulu  'డా||చక్రవర్తి' సినిమా ప్రారంభం!
'డా||చక్రవర్తి' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

రిషి, సోనియామాన్ హీరో, హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర సూపర్ మూవీస్ పతాకంపై శేఖర్ సూరి గారి దర్శకత్వంలో వెంకటేశ్వరులు, శేఖర్ సూరి, బి.ఆర్.రత్నమాల రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'డా|| చక్రవర్తి'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా, అగార్కర్, కిషోర్, అశోక్ మున్షి కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా..

నిర్మాత వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. ''25 సంవత్సరాలుగా శేఖర్ సూరితో నాకు మంచి పరిచయం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలో శేఖర్ గారు ఓ హిందీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఆరు నెలల ఖాళీ సమయం దొరకడంతో సినిమా చేద్దామని చెప్పారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. కాని సినిమాలో శేఖర్ గారి స్టైల్ మాత్రం మిస్ కాకుండా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి టైటిల్ కుదిరింది. ఈ నెల 23 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాం. నిర్విరామంగా షూటింగ్ జరిపి ఒకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్, వైజాగ్, అరకు, బొంబాయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం'' అని చెప్పారు.

డైరెక్టర్ శేఖర్ సూరి మాట్లాడుతూ.. ''ఫ్యామిలీ డ్రామాలకు, ప్రేమ కథలకు నేను చాలా దూరం. మొదటిసారి రియలిస్టిక్ గా ఉండే ఓ కుటుంబ కథా చిత్రం చేయాలని భావించాను. ఇందులో క్రైమ్, థిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ నెల 23 నుండి షూటింగ్ మొదలు పెట్టి 35 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో సందార్భానుసారంగా రెండు పాటలుంటాయి. విజయ్ కురాకుల మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి అధ్బుతమైన బాణీలను సమకూరుస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

రిషి మాట్లాడుతూ.. ''లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాలో నటిస్తున్నాను. క్రైమ్ ఎలిమెంట్స్ కూడిన  థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్స్ రాలేదు'' అని చెప్పారు.

సోనియామాన్ మాట్లాడుతూ.. ''తెలుగులో ఇది నా రెండవ సినిమా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సబ్జెక్టు. ఈ సినిమాలో గ్లామరస్ రోల్ లో నటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

గిరీష్ సహదేవ్ మాట్లాడుతూ.. ''సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాను. శేఖర్ గారు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కథలో ఉండే ట్విస్ట్స్, టర్న్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: తిరుపతి రెడ్డి, కెమెరామెన్: రాజేంద్ర, మాటలు: వి.ఆర్.ఎన్.శర్మ, మ్యూజిక్: విజయ్ కూరాకుల, ఆర్ట్ డైరెక్టర్: వెంకట్.ఆర్, నిర్మాతలు: వెంకటేశ్వరులు, శేఖర్ సూరి, బి.ఆర్.రత్నమాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శేఖర్ సూరి.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ