Advertisementt

'ఎఫైర్' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

Thu 19th Nov 2015 08:28 PM
affair movie platinum disc function,sreerajan,thummalapalli ramasathyanarayana  'ఎఫైర్' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
'ఎఫైర్' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
Advertisement
Ads by CJ

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రాధాన పాత్రల్లో భీమవరం టాకీస్ బ్యానర్ పై శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'ఎఫైర్'. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా.. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''శ్రీరాజన్ మొత్తం తానై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంతో శ్రీరాజన్ ఖచ్చితంగా పెద్ద దర్శకుల కోవలోకి వస్తాడు. హీరోయిన్స్ ఇద్దరు బాగా పెర్ఫార్మ్ చేసారు. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ అందరూ కష్టపడి పని చేసారు. ఇప్పటివరకు నేను డేట్ అనౌన్సు చేసిన చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయలేదు. కాని మేము అనుకున్న సమయానికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడం వలన ఈ చిత్రాన్ని వాయిదా వేశాం. నవంబర్ 27న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

శ్రీరాజన్ మాట్లాడుతూ.. ''ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. నన్ను నమ్మి ఈ సినిమాను నిర్మించిన రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు'' అని చెప్పారు.

కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడం చాలా కష్టం. అలాంటిది కాంట్రవర్శి ఉన్న సబ్జెక్టు తీసుకొని డేర్ చేసి సినిమా చేశారు. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమాలు రాలేదు. కొత్తగా ఉంటుంది. సాంగ్స్ చాలా బావున్నాయి. సినిమా కూడా హిట్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సిరాశ్రీ, గీతాంజలి, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ