Advertisementt

పాట పాడండి.. గిఫ్ట్ పొందండి!

Sat 21st Nov 2015 04:58 PM
bengal tiger singing competition,raviteja,sampath nandi,radhamohan  పాట పాడండి.. గిఫ్ట్ పొందండి!
పాట పాడండి.. గిఫ్ట్ పొందండి!
Advertisement
Ads by CJ

మాస్ మహరాజ రవితేజ క‌థానాయ‌కుడిగా, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు క‌థానాయిక‌లుగా, సంప‌త్‌నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. కె.కె రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని డిశంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా చిత్ర యూనిట్ బెంగాల్ టైగర్ సింగింగ్ కాంపిటిషన్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..

కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ''డిశంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్ సీస్ లో కూడా బెంగాల్ టైగర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ క్రమంలో నవంబర్ 30న ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నాం. కేవలం సినిమా టీం సంతోషం కోసం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించకుండా.. ప్రేక్షకుల్ని కూడా భాగస్వాములని చేయాలని బెంగాల్ టైగర్ సింగింగ్ కాంపిటిషన్ ను నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సినిమాలో ఉన్న ఐదు పాటల్లో ఏదొక పాట పల్లవి లేదా చరణం పాడి వారి డీటెయిల్స్ తో పాటు www.soundcloud.com కు పంపాలి. నవంబర్ 21 నుండి 28 వరకు వెబ్ సైట్ కు పాటలు పంపడానికి అవకాశం ఉంది. మొదటి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు కానుకలను ఇవ్వనున్నాం. అంతేకాకుండా మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ చేయబోయే తదుపరి చిత్రంలో గెలిచిన వారికి సింగర్ గా అవకాశం లభించనుంది. పాటలను హిట్ చేసిన విధంగానే సినిమా కూడా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సంపత్ నంది మాట్లాడుతూ.. '' నా మొదటి సినిమా 'ఏమైంది ఈ వేళ' లో పావని పాండే అనే కొత్త అమ్మాయికి సింగర్ గా ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆమె హిందీ, మరాఠి చిత్రాల్లో పాడుతూ.. చాలా బిజీ అయిపోయింది. అలానే బెంగాల్ టైగర్ లో కూడా నూతన అనే కొత్త సింగర్ తో పాట పాడించాం. కొత్త వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో బెంగాల్ టైగర్ సింగింగ్ కాంపిటిషన్ ను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

భీమ్స్ మాట్లాడుతూ.. ''రేడియోలో, ఐ ట్యూన్స్ లో బెంగాల్ టైగర్ పాటాలు బాగా వినిపిస్తున్నాయి. పాటలను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్. సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్. సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ