Advertisementt

'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం రిలీజ్ కు రెడీ!

Sun 22nd Nov 2015 07:06 PM
killing veerappan movie,release date,ram gopal varma,sandeep  'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం రిలీజ్ కు రెడీ!
'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం రిలీజ్ కు రెడీ!
Advertisement
Ads by CJ

సందీప్ భరద్వాజ్ ప్రధాన పాత్రలో శ్రీ కృష్ణా క్రియేషన్స్ సమర్పణలో జి.ఆర్.పిక్చర్స్, జెడ్ త్రీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ''వీరప్పన్ చరిత్రను సినిమాగా తెరకెక్కించాలని ఎప్పటినుండో ఆసక్తితో ఉన్నాను. 1990 లో పెద్ద హిస్టరీ ఉన్న నేరస్తుడు వీరప్పన్ ను చంపడానికి పోలీసులకు 20 సంవత్సరాలు పట్టింది. వీరప్పన్ జీవితంలో చాలా చాప్టర్స్ ఉన్నాయి. తన ఎలా చనిపోయాడనేదే ప్రధానంగా తీసుకొని దానికి సంబంధించిన అంశాలతో సినిమా తీశాను. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు వీరప్పన్ ను చంపడానికి సుమారుగా 700 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. అయితే ఒక మనిషికి వచ్చిన ఐడియాతో వీరప్పన్ ను ఎలా చంపాడనే కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెరకేక్కించాను. వీరప్పన్ కోణంలో కాకుండా పోలీసులు కోణంలోనే సినిమా ఉంటుంది. సినిమా కోసం ఎంతో రిసెర్చ్ చేసాను. వీరప్పను ను చంపడానికి నియమించిన ఇంటలిజెన్స్ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆఫీసర్ తో మాట్లాడాను. పోలీస్ బృందం వీరప్పన్ ను చంపడానికి ఎనిమిది నెలల ముందు ఆపరేషన్ మొదలుపెడతారు. అది చాలా కీలకమైనది. ఈ సబ్జెక్టు నేను చేసిన సినిమాలన్నింటిలో చాలా భిన్నమైనది. నా కెరీర్ లోనే డిఫరెంట్ మూవీ. వీరప్పన్ కు ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు. తను ఎవరు సహాయం చేయలేదు. అడవిలో ఉండే ఒక మృగం లాంటి వాడు. ప్రపంచంలోనే ఇలాంటి క్రిమినల్ లేడు. వీరప్పన్ ను చంపిన విధానం గురించి వింటే ఒక పోలీస్ అనేవాడు  ఇలా చెయొచ్చా అనిపిస్తుంది. కాని కొన్ని సందర్భాల్లో మనకు రిజల్ట్ ఒక్కటే ముఖ్యం. దానికోసం ఏదైనా చేయాలి. ఈ చిత్రాన్ని రియల్ లోకేషన్స్ లోనే షూట్ చేసాం. కర్నాటక లో ఫేమస్ అయిన రాజ్ కుమార్ ను వీరప్పను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ ఈ సినిమాలో నటిస్తే యాప్ట్ అవుతాడని తనను ఎంచుకున్నాను. సినిమాలో వీరప్పన్ పర్సనల్ లైఫ్ ను కూడా టచ్ చేసాను. ఈ చిత్రాన్ని కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందించాం. డిసెంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: రమ్మీ, సంగీతం: రవి శంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, ఆర్ట్: రఘు కులకర్ణి, యాక్షన్: అలెన్ అమీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుదీర్ చంద్ర పధిరి, నిర్మాతలు: బి.వి.మంజునాథ్, శివ ప్రకాష్, బి.ఎస్.సుధీంద్ర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ