Advertisementt

మోహన్ బాబుకు ఇది ముగింపు కాదు-దాసరి!

Mon 23rd Nov 2015 12:04 PM
mohan babu completes 40 years,dasari narayanarao,swargam narakam movie  మోహన్ బాబుకు ఇది ముగింపు కాదు-దాసరి!
మోహన్ బాబుకు ఇది ముగింపు కాదు-దాసరి!
Advertisement
Ads by CJ

సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు సినిమాల‌పై ఆస‌క్తితో చెన్నై న‌గ‌రాన్ని చేరుకున్నారు. దాసరి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో1975, న‌వంబ‌ర్ 22న విడుద‌లైన స్వ‌ర్గం-న‌ర‌కం సినిమాతో న‌టుడుగా తెలుగు తెర‌కు మోహ‌న్‌బాబుగా ప‌రిచయం అయ్యారు. నేటితో నటునిగా తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నాలుగు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంటున్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కేవలం ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మోహన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలపడం కాకుండా వారి ముగ్గురు వారసులు మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు, మనోజ్ లు సంవత్సరం మొత్తం కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 

మొదటగా.. మోహన్ బాబు కు నచ్చిన రెండు చిత్రాలు 'అసెంబ్లీ రౌడీ','రాయలసీమ రామన్న చౌదరి' చిత్రాల షూటింగ్ లో జరిగిన ప్రతి సంఘటనను పదిలపరచనున్నారు. 

మోహన్ బాబు నటించిన సినిమాల్లో టాప్ లో ఉన్న అరవై పాటలను సీడీల రూపంలో రిలీజ్ చేయనున్నారు. 

మోహన్ బాబు నలభై సంవత్సరాల కెరీర్ లో ట్రావెల్ చేసిన దర్శకులతో, నటీనటులతో, నిర్మాతలతో ఒక టాక్ షో ను నిర్వహించనున్నారు.

మోహన్ బాబు గారి అరుదైన ఫోటోలను సేకరించి పిక్చర్ ఎగ్జిబిషన్ ను కండక్ట్ చేస్తున్నారు.

మోహన్ బాబు గారి ఫేమస్ డైలాగ్స్ అన్ని ఒక పుస్తకంగా విడుదల చేయనున్నారు.

వ్యక్తిగతమైన, వృత్తికి సంబంధించిన ఫోటోలను ఓ పుస్తకంగా తయారు చేయనున్నారు. 

మోహన్ బాబు నటించిన 550 చిత్రాల్లో తెరవెనుక జరిగిన సన్నివేశాలను ప్రేక్షకులకు తెలియబరచనున్నారు.

ఆయన చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ అయిన పెదరాయుడు చిత్రాన్ని డిజిటల్ చేసి మరోసారి విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''మోహన్ బాబు నటించిన 'స్వర్గం నరకం' సినిమా విడుదలయ్యి నేటితో నలభై సంవత్సరాలయ్యింది. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలను చూసాను.. చేసాను. కాని ఈ కార్యక్రమం చూస్తుంటే నా కళ్ళు చమర్చాయి. ఎందుకంటే ఇది నా కుటుంబం. మా ఇంటి పెద్ద కొడుకు మోహన్ బాబు. ఈ వేదికపై సంపూర్ణమైన మోహన్ బాబు కుటుంబాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను సాధించనిది.. మోహన్ బాబు ద్వారా సాధించుకున్నాను. కొంతమంది యాక్టర్స్ ను పరిచయం చేసి వొదిలేస్తారు. కాని నేను మోహన్ బాబుని సంపూర్ణ నటునిగా చేసి వదిలాను. 'కేటుగాడు' సినిమాతో హీరోగా విజ్రుంభించి 'పాలు నీళ్ళు' చిత్రంతో సిల్వర్ జూబ్లీ జాబితాలో చేరాడు. ఈ నలభై సంవత్సరాల్లో మోహన్ బాబు ప్రతి కదలిక నాకు తెలుసు. స్వర్ఘం నరకం సినిమా తరువాత తూర్పు పడమర సినిమా చేసాను. ఆ సినిమాలో మోహన్ బాబునే హీరోగా అనుకున్నాను. రజినీకాంత్ హీరోగా నేను నటిస్తానని ముందుకొచ్చాడు. రెండో చిత్రానికే పోటీ పడ్డారు. ఈరోజు వారిద్దరు మంచి స్నేహితులు. సొంతంగా బ్యానర్ పెట్టి హిట్స్ కొట్టాడు. 'అల్లుడు గారు','అసెంబ్లీ రౌడీ' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడు. తనకు సమయంలేక వదిలేసిన చిత్రాలతో కొందరు హీరోలు అయిపోయారు. మల్టిపుల్ టాలెంట్ ఉన్న నటుడు. భారత సినీ చరిత్రలో మోహన్ బాబు కు ఉన్న గ్రాఫ్ నాగేశ్వరావు, రామారావు, దిలీప్ కుమార్ లాంటి నటులకు కూడా లేదు. తను నటించిన 'పెదరాయుడు' చిత్రం ఓ ఆణిముత్యంగా మిగిలిపోయింది. వందకు వంద శాతం రిజల్ట్ ఇచ్చే అతి తక్కువ మంది నటుల్లో మోహన్ బాబు ఒకడు. తన బిడ్డల్ని ప్రమోట్ చేసి వాళ్ళని మంచి స్థానాలకు తీసుకురావాలని ఎంతో శ్రమ పడ్డాడు. నలభై సంవత్సరాలు మోహన్ బాబు జీవితానికి ముగింపు కాదు. వెటకారం, వెక్కిరింపులతో ఆరు పాటలు, ఆరు ఫైట్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. ఈ కోణంలో మోహన్ బాబు సినిమా తీసి చరిత్ర సృస్తిస్తాడనే నమ్మకం నాకుంది'' అని చెప్పాడు.

సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ''మోహన్ బాబు గారిది రిమార్కబుల్ లైఫ్. దాసరి గారి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యి అరవై సినిమాలను నిర్మించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా బిడ్డల ఎదుగుదల కోసం కృషి చేసాడు'' అని చెప్పారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. ''నలభై సంవత్సరాలు నటునిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తన జీవితాన్ని సాగించారు. సింపుల్ గా ఉండే గొప్ప మనిషాయన. ఏ పాత్రలో అయిన ఒదిగిపోయి నటిస్తారు'' అని చెప్పారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. ''ఈ నలభై సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియట్లేదు. నాన్నగారు టీచర్. మా వూర్లో మూడు ఎకరాల పొలం ఉండేది. ఏదైనా.. ఉద్యోగం చేయరా లేదా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేవారు. నా తండ్రి తరువాత తండ్రి లాంటి వారు దాసరి నారాయణరావు గారు. కో డైరెక్టర్ గా పని చేస్తున్న నన్ను నటునిగా మార్చారు. నా తండ్రి భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు అని పేరు పెడితే మోహన్ బాబు అని మరో పెట్టారు దాసరి గారు. క్రమశిక్షణ నేర్పించారు. మహానటుడు ఎన్టీఆర్ తరువాత అంతటి నటుడు మోహన్ బాబు మాత్రమే అని చెప్పారు. నేను నటించిన 550 చిత్రాల్లో ఎక్కువ శాతం నటించింది ఆయన సినిమాల్లోనే. ఆత్రేయ, బి.గోపాల్, రాఘవేంద్ర రావు వంటి వారందరూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసారు. నేను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం నా తల్లితండ్రులు చేసిన పుణ్యమే. నా తండ్రి టీచర్ అవ్వడంతో ఓ విద్యాసంస్థను మొదలు పెట్టాలని 400 మంది విద్యార్థులతో స్థాపించిన  శ్రీ విద్యానికేత‌న్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ ఈరోజు 12500 మంది విద్యార్థులతో విజవంతంగా నడుస్తోంది. కులమతాలకు అతీతంగా 25శాతం ఉచితం విద్యను అందిస్తున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ