శేఖర్, సుష్మ, కీ.శే. ఎం.ఎస్.నారాయణ ప్రధాన పాత్రల్లో దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పనుకు రమేష్ బాబు, వర్మ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. నా ప్రేమ కథ'. వర్ధన్ దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు వర్ధన్ మాట్లాడుతూ.. ''ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి ప్రేమ కథే ఈ చిత్రం. ప్రేమ కథలతో చాలా సినిమాలు తీసారు. ఈ చిత్రం మాత్రం భిన్నంగా ఉంటుంది. సినిమాలో క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నవంబర్ 27న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
నిర్మాత పనుకు రమేష్ బాబు మాట్లాడుతూ.. ''కొత్త నటీనటులతో కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
కె.ఎన్.రావు మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు, క్లైమాక్స్ హైలైట్స్ గా నిలుస్తాయి. హీరోగా శేఖర్ చాల బాగా నటించాడు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
హీరో శేఖర్ మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి చిత్రం. ప్రతి ప్రేక్షకుడికి సినిమా కనెక్ట్ అవుతుంది. కొత్త పాయింట్ తో క్లైమాక్స్ ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలో అలాంటి క్లైమాక్స్ రాలేదు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. చిన్న చిత్రంగా తెరకెక్కించినా విడుదలయ్యాక పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: చిన్ని చరణ్, మితిన్ ఎం.ఎస్, కెమెరా: నగేష్ ఆచార్య, డాన్స్: విద్య సాగర్, కిరణ్, డైరెక్టర్: వర్ధన్, ప్రొడ్యూసర్: వర్మ, పనుకు రమేష్ బాబు.