సందీప్ కిషన్ నటించిన 'టైగర్' చిత్రానికి ఏవరేజ్ టాక్ రావడంతో తన చేయబోయే తదుపరి చిత్రాలపై చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దర్శకుడు రాజసింహతో 'ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. తాజాగా సందీప్ మరో సినిమాలో నటించడానికి అంగీకరించాడు. టైటిల్ ఖారారు చేయని ఈ సినిమా ఆదివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై లిమిటెడ్ పై అనిల్ సుంకర సమర్పణలో పిక్సల్ డ్రీమ్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై అని కన్నెగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిమిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా రూపొందనుంది. అనీషా ఆంబ్రోస్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్ కొట్టగా, ఎమ్.ఎల్.ఎ గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపత్ నంది గౌరవ దర్శకత్వం వహించారు.