Advertisementt

రేష్మి కి మరో అవకాశం!

Thu 17th Dec 2015 01:08 AM
rashmi gautham,rashmi gautam movie opening,v cine studio movie,diwakar,leena  రేష్మి కి మరో అవకాశం!
రేష్మి కి మరో అవకాశం!
Advertisement
Ads by CJ

జబర్ధస్త్‌ రేష్మి హీరోయిన్‌గా వి. సినీ స్టూడియో నూతన చిత్రం ప్రారంభం 

వి. సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్‌ దర్శకత్వంలో 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు బి. గోపాల్‌, కమెడియన్‌ ఆలీలు పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వి. లీనా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రేమకథా చిత్రమ్‌ చిత్ర దర్శకులు జె. ప్రభాకర్‌రెడ్డి వ్యవహిరిస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డి. దివాకర్‌ మాట్లాడుతూ..'ఆద్యంతం ఆకట్టుకునే హర్రర్‌ చిత్రమిది. రేష్మిగారు ఈ పాత్రకు యాఫ్ట్‌ అనిపించి ఎంపిక చేశాం. ఈరోజు(డిశంబర్‌ 16) నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకుని జనవరి ఎండింగ్‌కి చిత్రాన్ని పూర్తి చేయనున్నాం..' అని అన్నారు. 

రేష్మి, ఆనంద్‌బాబు, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, కాశీవిశ్వనాధ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర్‌ రెడ్డి, స్టోరీ అండ్‌ స్క్రిఫ్ట్‌: ప్రసాద్‌ వనపల్లె, డైలాగ్స్‌: కాశీ విశ్వనాధ్‌, సమర్పణ: బాలాజీ నాగలింగం, నిర్మాత: వి. లీనా, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డి. దివాకర్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ