Advertisementt

రవితేజ మాట నిజమైంది: సంపత్ నంది!

Sat 19th Dec 2015 01:50 PM
bengal tiger success meet,raviteja,sampath nandi,thamanna  రవితేజ మాట నిజమైంది: సంపత్ నంది!
రవితేజ మాట నిజమైంది: సంపత్ నంది!
Advertisement
Ads by CJ

మాస్ మహరాజ రవితేజ కథానాయకుడిగా, తమన్నా, రాశిఖన్నా లు కథానాయికలుగా, సంపత్ నంది దర్శకత్వం వహించిన చిత్రం బెంగాల్ టైగర్. కె.కె రాధామోహన్ నిర్మాత. డిశంబర్ 10న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో రవితేజ మాట్లాడుతూ.. ''బెంగాల్‌ టైగర్‌' చిత్రంతో సంపత్ కు హ్యట్రిక్‌ హిట్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కోసం ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు. సంపత్‌నంది, రాధామోహన్‌ గారి కాంబినేషన్  లో మరో సినిమా చేయాలనుంది'' అని అన్నారు.

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ.. ''సంపత్‌నంది ఈ సినిమాతో హ్యట్రిక్‌ హిట్‌ కొడతాడని రవితేజగారన్నారు. ఆ మాట ఈరోజు నిజమయినందుకు చాలా హ్యపీగా ఉంది. నిర్మాత రాధామోహన్‌గారు, రవితేజగారు మంచి సపోర్ట్ అందించారు. తమన్నా, రాశిఖన్నా ల గ్లామర్‌ సినిమాకు చాలా ప్లస్‌ అయింది. సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ''డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా చేసినందుకు తృప్తిగా, గర్వంగా ఉంది. సంపత్ నంది, నా కాంబినేషన్ లో వచ్చిన ఏమైంది ఈవేళ చిత్రంతో ఒక హిట్ అందుకుంటే, ఇప్పుడు మళ్ళీ 'బెంగాల్‌ టైగర్‌'తో మరో సక్సెస్‌ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని అన్నారు. 

తమన్నా మాట్లాడుతూ.. ''ఈ సక్సెస్‌మీట్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సంపత్‌నందిగారు సినిమాను బాగా డైరెక్ట్‌ చేశారు. రవితేజ గారు లేకుండా ఈ సినిమా సక్సెస్‌ను ఉహించలేం. రాధామోహన్‌గారు సినిమాను పక్కా పాన్లింగ్‌తో ముందుకు తీసుకెళ్ళారు. మంచి టీంతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన అందరికీ థాంక్స్‌. '' అని అన్నారు.   

ఇంకా ఈ కార్యక్రమంలో రామ్‌క్ష్మణ్‌, సుద్ధా అశోక్‌తేజ, వాకాడ అప్పారావు, సునీల్‌ నారంగ్‌, అశోక్‌కుమార్‌, ఎం.ఎస్‌.కుమార్‌, నాగినీడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ