Advertisementt

అల్లరి నరేష్ నీకిది తగునా!

Mon 21st Dec 2015 09:33 PM
allari naresh interview boycott,mama manchu alludu kanchu,e.v.v.sathyanarayana  అల్లరి నరేష్ నీకిది తగునా!
అల్లరి నరేష్ నీకిది తగునా!
Advertisement
Ads by CJ

'సుడిగాడు' సినిమా తరువాత అల్లరి నరేష్ కెరీర్ లో చెప్పుకోవడానికి సరైన హిట్ రాలేదు. 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి','బందిపోటు','జేమ్స్ బాండ్' ఇలా వరుసగా అన్ని ఫ్లాపులే. రీసెంట్ గా లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తో కలిసి 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లరి నరేష్ ఇంటర్వ్యూ ను ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కు అల్లరి నరేష్ ఎంతసేపటికి రాకపోవడంతో మీడియా బాయ్కాట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అల్లరి నరేష్ తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ బ్రతికున్నంత కాలం ఇలాంటి పరిణామాలు జరగలేదు. ఆయన ఉన్నప్పుడు ఉన్న క్రమశిక్షణ, నిబద్దత ఇప్పుడు వారి కుమారుడికి లేనట్లు కనిపిస్తుంది. హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో అల్లరి నరేష్ ఇలా చేయడం సరికాదని పలువురు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ