Advertisementt

రొటీన్ చిత్రాలనే మాటలు గట్టిగా వినిపించాయి:రామ్

Tue 22nd Dec 2015 04:53 PM
nenu sailaja movie audio launch,ram,keerthi suresh,kishore thirumala,sravanthi ravikishore  రొటీన్ చిత్రాలనే మాటలు గట్టిగా వినిపించాయి:రామ్
రొటీన్ చిత్రాలనే మాటలు గట్టిగా వినిపించాయి:రామ్
Advertisement
Ads by CJ

రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. దర్శకుడు కరుణాకరన్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా..

కరుణాకరన్ మాట్లాడుతూ.. ''టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

రామ్ మాట్లాడుతూ.. ''పెదనాన్న గారు త్రివిక్రమ్ గారితో సినిమాలు చేసే సమయంలో ఇంటికొచ్చి కొన్ని డైలాగ్స్ చెప్పేవారు. అవి విని చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని. మళ్ళి కిషోర్ కథ చెప్పినపుడు వింటుంటే అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. రచయిత డైరెక్టర్ గా మారితే ఎంత బాగా సినిమాలు చేయగలరో ఈ మధ్య చాలా మంది నిరూపించారు. రొటీన్ సినిమాలు చేస్తున్నాననే మాటలు నాకు గట్టిగా వినిపించాయి. అందుకే డిఫరెంట్ గా ఈ సినిమా ట్రై చేశాను. దేవిశ్రీప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సమీర్ గారు ప్రతి ఫ్రేం ఎంతో అందంగా చూపించారు'' అని చెప్పారు.

కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాసం ఇచ్చిన రవి కిషోర్ గారికి, రామ్ కు థాంక్స్. రామ్ సెట్స్ లోకి వచ్చిన మొదటిరోజు నేను కొత్తగా కనిపించాలని చెప్పారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాననే అనుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది. కీర్తి చాలా బాగా నటించింది. మంచి టీం కుదరడంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేశాం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ'' స్టొరీ చెప్పగానే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. రామ్ లో ఎనర్జీ చూసి సర్ప్రైజ్ అయ్యాను. సమీర్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. నాకు ఈ చాన్స్ ఇచ్చిన స్రవంతి రవి కిషోర్ గారికి థాంక్స్'' అని చెప్పారు

సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ''రామ్ తో 'మస్కా' సినిమాలో కలిసి వర్క్ చేశాను. తనలో మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమాలో తనది యూనిక్ క్యారెక్టర్. ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేయగలగాలి. ఆ పాత్రలో రామ్ తప్ప మరెవరు నటించలేరు. రామ్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచే చిత్రమవుతుంది'' అని చెప్పారు.

ప్రిన్స్ మాట్లాడుతూ.. ''కిషోర్ గారు ఆర్టిస్ట్స్ అందరిని చక్కగా హ్యాండిల్ చేసారు. సాంగ్స్ అన్ని బావున్నాయి. క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్ నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా ద్వారా మంచి అవకాసం లభించింది'' అని చెప్పారు. 

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ''రఘువరన్ బి.టెక్ చిత్రంతో 2015లో పెద్ద హిట్ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో 'నేను.. శైలజ' సినిమాతో మరో హిట్ సినిమా ఇవ్వనున్నారు. ఈ సినిమాతో కిషోర్ స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరుతాడు. రామ్ కి సరైన పాత్ర ఇది. మంచి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది'' అని చెప్పారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ''నాకు ఇష్టమైన హీరో రామ్ నటించిన సినిమాలో పాట రాయడం ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ లో రెండోసారి పని చేస్తున్నాను. కిషోర్ నాకు మంచి ఫ్రెండ్. శైలజ అనే పాట హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నాను'' అని చెప్పారు.

ప్రదీప్ రావత్ మాట్లాడుతూ.. ''రామ్ నేను కలిసి రెండు సినిమాలకు వర్క్ చేశాం. వండర్ ఫుల్ యాక్టర్. డాన్స్ చాలా బాగా చేస్తాడు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో  కోటి, రోహిణి, అనంత శ్రీరాం, రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కొడాలి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల, అనంత శ్రీరాం, సాగర్, కోరియోగ్రఫీ: శంకర్, దినేష్, ప్రేమ రక్షిత్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: స్రవంతి రవికిషోర్, రచన,దర్శకత్వం: కిషోర్ తిరుమల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ