రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2016 జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. హీరోయిన్ కీర్తి సురేష్ విలేకర్లతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఐనా ఇష్టం నువ్వు' అనే తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు నన్ను కలిసి ఈ సినిమా కథ చెప్పారు. ఆయన నేరేట్ చేసినప్పుడే ఈ చిత్రంలో ఎలా అయినా నటించాలనుకున్నాను. ఎమోషన్స్, ఒక డ్రామా, తండ్రి కుతుర్ల మధ్య ఉండే అనుబంధం అన్ని బాగా నచ్చాయి. శైలజ అనే పాత్రలో కనిపిస్తాను. ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండే పాత్ర. రామ్ మంచి ఎనర్జిటిక్ యాక్టర్. స్రవంతి రవికిషోర్ గారి బ్యానర్ లో పని చేయడం ఆనందంగా ఉంది. చాలా కేరింగ్ గా చూసుకున్నారు. నేను ఇప్పటివరకు నటించిన సినిమాలకు ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కమర్షియల్ ఫిలిం అయినా చాలా సెటిల్డ్ గా ఉంటుంది. రియలిస్టిక్ గా ఉండే స్టొరీ. నా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తాను. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో, క్వీన్ లాంటి పాత్రల్లో నటించాలని ఉంది'' అని చెప్పారు.