మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ చిత్రంలోని మొదటిపాటను టీజర్ గా క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా..
దర్శకుడు దశరధ్ మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ఈ పాటను కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను'' అని చెప్పారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ''షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి మొదటివారంలో ఆడియో రిలీజ్ చేసి చివరి వారంలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దశరధ్ లాంటి దర్శకుడితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. రెజీనా, మనోజ్ చక్కగా నటించారు. వేదా మంచి మ్యూజిక్ ఇచ్చాడు'' అని చెప్పారు.
రెజీనా మాట్లాడుతూ.. ''వేద డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అయినా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దశరధ్ గారు ఆర్టిస్ట్స్ ల డైరెక్టర్. ఈ సినిమాలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
నందు మాట్లాడుతూ.. ''ఇదొక థ్రిల్లింగ్ లవ్ స్టొరీ. మనోజ్ లాంటి మాస్ లుక్ తో ఉన్న హీరోను దశరధ్ గారి స్టైల్ లో చూపించబోతున్నారు. ట్విస్ట్ తో సినిమా ఓపెన్ అయ్యి కథ అంతా అలానే సాగుతుంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జి.వి, శివారెడ్డి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్, బెనర్జీ, జి.వి., ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, సత్యప్రకాష్, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్, చంద్రకాంత్, రూప ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్ ప్లే: గోపు కిషోర్, రచన: గోపి మోహన్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: శివకుమార్ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్.