'ముకుంద' చిత్రంతో హీరోగా పరిచయమైన మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'లోఫర్'. డిశంబర్ 17న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ టూర్ ను నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్ కు తిరివచ్చిన 'లోఫర్' టీం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''ప్రతి ఊరు, ప్రతి థియేటర్ కు వెళ్లి ప్రేక్షకుల స్పందన చూశాం. అందరూ వరుణ్ తేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాతో వరుణ్ కి మంచి పేరు వచ్చింది. రేవతి గారు, పోసాని ల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లకు లేడీస్ ఎక్కువగా వస్తున్నారు. నెల్లూరులో అయితే థియేటర్ అంతా ఆడవాళ్లే ఉన్నారు. మధర్ సెంటిమెంట్ తో కూడిన ఓ ఫ్యామిలీ చిత్రమిది. అందరూ తమ కుటుంబ సభ్యులతో సినిమా చూడాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''వైజాగ్ నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు సక్సెస్ టూర్ నిర్వహించాం. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రేక్షకుల నుండి వస్తోన్న ఫీడ్ బ్యాక్ బావుంది. నేను చేసిన రెండు సినిమాల్లో కెల్లా ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్'' అని చెప్పారు.
చరణ్ దీప్ మాట్లాడుతూ.. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతోంది. సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి థాంక్స్. ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది'' అని చెప్పారు.
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ''నేను ఇప్పటివరకు రాసిన మొదటి పది పాటల్లో 'సువ్వి సువ్వాలమ్మా' పాట ఉంటుంది. కొడుకులందరి గొంతును వరుణ్ తేజ్ గొంతులో వినిపించారు. అనేకమందిని ఈ పాట కదిలించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కందికొండ, రమ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.