చాందిని ప్రధాన పాత్రలో భాను ప్రకాష్ బలుసు దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్ 'చిత్రం భళారే విచిత్రం'. పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో మనోజ్ నందం, అనీల్ కళ్యాణ్ ఇతర పాత్రధారులు. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో..
దర్శకుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ.. ''పది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను. 'ప్రయోగం' అనే ఎక్స్ పెరిమెంటల్ ఫిలిం చేశాను. కాని నాకున్న ఆర్ధిక కారణాల వలన ఆ సినిమా రిలీజ్ చేయలేకపోయాను. ఈ సినిమా కథ ఉమాకాంత్ గారికి చెప్పగానే ఆయన ఎగ్జైట్ అయ్యి సినిమా చేయడానికి ముందుకొచ్చారు. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికే ప్రయత్నించాం. ఇదొక కామెర్ థ్రిల్లర్ సినిమా. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మటు కి భిన్నంగా ఉండే చిత్రమిది. సెన్సార్ సభ్యుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది'' అని చెప్పారు.
నిర్మాత ఉమాకాంత్ మాట్లాడుతూ.. ''కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్ అన్ని సమపాళ్ళలో ఉంటాయి. క్లైమాక్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. నిర్మానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నూతన సంవత్సరం కానుకగా మా సినిమాను జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం'' అని చెప్పారు.
అనిల్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''న్యూ ఇయర్ కి సినిమా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.
చాందిని మాట్లాడుతూ.. ''నా కెరీర్ లో ఇది చాలా ముఖ్యమైన సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. టీం ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా'' అని చెప్పారు.
సౌమ్య, శుభశ్రీ, జీవా, సూర్య, ప్రభాస్ శ్రీను, అల్లరి సుభాషిని, వేణుగోపాలరావు, వాసు ఇంటూరి, రాము, కేక భాషా, శరత్ బాబు పుదూరు, రుద్ర ప్రకాష్, రాకెట్ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎడిటింగ్: గోపి సిందం, సంగీతం: కనకేష్ రాథోడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాము వీరవల్లి.