కల్వకుంట్ల తేజేశ్వర్ రావ్(కన్నారావ్) నిర్మాతగా గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'షీ'. 'ఈజ్ వెయింటింగ్' అనేది ట్యాగ్‌లైన్. శ్వేతామీనన్; మహత్ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ...
నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు మాట్లాడుతూ ''ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. రమేష్ మాస్టర్ డిఫరెంట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. జనవరి 16కు ఈ సాంగ్ ను పూర్తి చేసేసి, ఫిభ్రవరిలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేస్తున్నాం. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మాట్లాడుతూ ''మన సంస్కృతి సంప్రదాయాలకు భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్చమైన ప్రేమకథ. నిర్మాతగారు అద్భుతమైన సపోర్ట్ ను అందిస్తున్నారు'' అన్నారు.
మహత్ రాఘవేంద్ర మాట్లాడుతూ ''ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. ప్యాషనేట్ నిర్మాత. మంచి టీంతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.
చేతన ఉత్తేజ్ మాట్లాడుతూ ''సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. రమేష్ మాస్టర్ పంచభూతాలపై కొరియోగ్రఫీ చేస్తున్నారు. సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది. దర్శక, నిర్మాతలు ఫుల్ ఎనర్జీతో టీంను నడిపిస్తున్నారు'' అన్నారు.
ధనరాజ్ మాట్లాడుతూ ''ఈ చిత్రంలో నా పాత్ర పేరు బసవరాజు. సినిమాలో కీలకమైన పాత్ర. మహత్ కు, చేతనకు మంచి బ్రేక్ తెచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.
కవిత, రమాప్రభ, పోసాని, సూర్య, ధనరాజ్, చిత్రం శ్రీను తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: రామకృష్ణ, పాటలు: కాసర్ల శ్యామ్, రామ్ పైడి శెట్టి, సాయిసిరి, సంగీతం: బోలే, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బసంత్ రెడ్డి, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.