నిరంజన్ దేశ్ పాండే, దిశా పాండే, చిక్కన్న, విక్రమ్ ప్రధాన పాత్రల్లో చంద్రమోహన్ దర్శకత్వం వహించిన చిత్రం 'బొంబాయి మిఠాయి'. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''రెండు కోట్ల పెట్టుబడితో కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా 15 కోట్ల షేర్స్ కలెక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలనుకున్నప్పుడు నాకు పోటీగా రాజ్ కందుకూరి గారు సినిమాను కొనడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇద్దరం కలిసి సినిమా రైట్స్ తీసుకొని తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నాం. 'ట్రాఫిక్' సినిమాకు మాటలు అందించిన కృష్ణతేజ ఈ సినిమాకు కూడా పని చేశారు. 2015 డిశంబర్ లో రిలీజ్ చేయలనుకున్నాం కాని కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేస్తే బావుంటుందని జనవరి 22 న డేట్ ఫిక్స్ చేశాం'' అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''రామసత్యనారాయణ గారితో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఆయనతో లాంగ్ టర్మ్ రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నాను. ఆయన మంచి మాటకారి, చమత్కారి. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''సినిమా టీజర్ చూస్తుంటే ఫిలిం బై అరవింద్ సినిమా షాట్స్ గుర్తొస్తున్నాయి. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది. టీజర్ చాలా బావుంది. కన్నడలో 15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమరత్, మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ వై.ప్రసాద్, బి.సత్యనారాయణ, ఆడియో: ప్లే బ్యాక్(శేషు కె.ఎం.ఆర్), సమర్పణ: రాజ్ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చంద్రమోహన్.