Advertisementt

'ఇది నా లవ్ స్టొరీ' ఫస్ట్ లుక్ లాంచ్!

Sat 09th Jan 2016 01:22 PM
idi na love story first look launch,tarun,oviya,ramesh gopi,prakash  'ఇది నా లవ్ స్టొరీ' ఫస్ట్ లుక్ లాంచ్!
'ఇది నా లవ్ స్టొరీ' ఫస్ట్ లుక్ లాంచ్!
Advertisement
Ads by CJ

తరుణ్, ఓవియా జంటగా రమేష్, గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'ఇది నా లవ్ స్టొరీ'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో తరుణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

హీరో తరుణ్ మాట్లాడుతూ.. ''కన్నడలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాం. అక్కడ అందరు కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ ఇది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బావుంటాయి. మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. సినిమాలో లవ్ స్టొరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. శ్రీనాథ్ విజయ్ మంచి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. నాలుగు పాటలు, 15 నుండి 20 రోజుల టాకీ పార్ట్ మిగిలి ఉంది. దర్శకులు రమేష్, గోపి తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా అంతా హీరో, హీరోయిన్ ల మీదే నడుస్తుంటుంది'' అని చెప్పారు.

దర్శకులు రమేష్, గోపి మాట్లాడుతూ.. ''కన్నడలో ఈ సినిమా చూసిన తరువాత తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. తెలుగు నేటివిటీకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసాం. తరుణ్ మంచి కమిట్మెంట్ ఉన్న నటుడు. 70 శాతం షూటింగ్ పూర్తి చేశాం. ఉడిపి, కూర్కు పోర్షన్స్ చాలా బాగా వచ్చాయి. ఒక అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు ప్రేమించామనేది కాదు, ఎంత బాగా ప్రేమించామనే లైన్ మీద సినిమా రన్ అవుతుంది'' అని చెప్పారు.

నిర్మాత ఎస్.వి.ప్రకాష్ మాట్లాడుతూ.. ''ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. అందరు చాలా బాగా కోపరేట్ చేస్తున్నారు. తరుణ్ చాలా హెల్ప్ చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తి చేసి మార్చి మొదటివారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

ఓవియా మాట్లాడుతూ.. ''తమిళంలో 12 చిత్రాల్లో నటించాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: క్రిస్టోఫర్ జోసఫ్, మ్యూజిక్: శ్రీనాథ్ విజయ్, ఎడిటర్: సింగంపల్లి శివ శంకర్, డైలాగ్స్: వీరబాబు బాసిన, ఆర్ట్: జె.కె.మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ పి, జగదీశ్, నిర్మాత: ఎస్.వి.ప్రకాష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ గోపి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ