Advertisementt

నాకు నేనే పోటీ: బాలకృష్ణ!

Sun 10th Jan 2016 07:01 PM
dictator movie success meet,balakrishna,anjali,srivas  నాకు నేనే పోటీ: బాలకృష్ణ!
నాకు నేనే పోటీ: బాలకృష్ణ!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'డిక్టేటర్'. ఇటీవల విడుదలయిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీవాస్, బాలకృష్ణ, అంజలి యూనిట్ అందరికి షీల్డులను అందించారు. ఈ సందర్భంగా..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''డిక్టేటర్ ఒక అధ్బుతమైన టైటిల్. సినిమా టైటిల్ బట్టి ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. డిక్టేటర్ అనే టైటిల్ సింహ ఘర్జనలా ఉంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి శ్రీవాస్ అంతా తానై పని చేశాడు. లెజెండ్ సినిమాలా మంచి సంగీతం కుదిరింది. తమన్ అధ్బుతమైన బాణీలను సమకూర్చారు. దానికి తగిన సాహిత్యాన్ని భాస్కర్ భట్ల, రామజోగయ్యశాస్త్రి, యాదగిరి అందించారు. చిన్న అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతం. నాకు సినిమాలో నచ్చే రెండే రెండు శాఖలు మ్యూజిక్, ఎడిటింగ్. ఆ రెండు ఈ సినిమాకు ప్లస్ గా నిలుస్తాయి. డిఫరెంట్, డిఫరెంట్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. బల్గేరియా, స్విట్జర్ లాండ్ ప్రాంతాల్లో షూట్ చేసిన పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమాలో నేను కుర్రాడిలా కనిపిస్తున్నానని చెబుతున్నారు. శ్యాం కె నాయుడు ప్రతి ఫ్రేం అందంగా చూపించారు. నా సినిమాలు నాకే పోటీ. నేను వేరే వాళ్ళతో పోల్చుకోను. నటన అనేది పరకాయ ప్రవేశం లాంటిది. చెప్పిన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి నటించాలి. అంజలి తెలుగమ్మాయి. సినిమాలో చక్కగా నటించింది. అలానే సోనాల్ చౌహాన్ కూడా ఈ సినిమాలో బాగా నటించింది. ఏవిషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న పిల్లలతో సహా అందరూ నా డైలాగ్స్ చెబుతున్నారంటే దానికి కారణం సాంకేతిక నిపుణులే. సంక్రాతి కానుకగా 'డిక్టేటర్' రిలీజ్ కానుంది. కుటుంబంతో సహా చూడగలిగే చక్కటి చిత్రమిది'' అని చెప్పారు.

శ్రీవాస్ మాట్లాడుతూ.. ''సినిమా ఫంక్షన్ లా కాకుండా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ కూడా ఎలా చేయగలిగావని నన్ను చాలా మంది అడిగారు. అంత ధైర్యం చేయడానికి కారణం బాలకృష్ణ గారు. కథను నమ్మి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు మంచి సహకారం అందించారు. శ్యాం కె నాయుడు గారి ఫోటోగ్రఫీ చాల రిచ్ గా ఉంటుంది. తమన్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న సినిమా రిలీజ్ అవుతుంది. పండగ సినిమా అంటే ఇదే'' అని చెప్పారు.

అంజలి మాట్లాడుతూ.. ''నాకు బాగా నచ్చిన సినిమా ఇది. చాలా స్టైలిష్ గా ఉంటుంది. తమన్ మంచి ట్రాక్స్ ఇచ్చారు. శ్యాం గారు ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించారు. బాలకృష్ణ గారు మంచి మనసున్న వ్యక్తి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చలపతిరావు, చిన్న, జి.వి, కాశీవిశ్వనాథ్, అజయ్, సుమన్, గౌతంరాజు, రత్నం, బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: గౌతంరాజు, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, ప్రొడ్యూసర్: ఎరోస్ ఇంటర్నేషనల్, కో-ప్రొడ్యూసర్: వేదాస్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ